Arikela narsa reddy
-
ఇంద్రవెల్లి నుంచే ఎన్నికల శంఖారావం..
నిర్మల్: ఇంద్రవెల్లి సభ నుంచే కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తుందని మాజీ ఎమ్మెల్సీ అరిగెల నర్సారెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని శ్రీహరిరావు క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి చేయలేని పనులను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే సగం హామీలు నెరవేర్చిందని చెప్పారు. -
అలిగిన అరికెల నర్సారెడ్డి
హైదరాబాద్: టి.టీడీపీ ఎమ్మెల్సీ సీటు వేం నరేందర్ రెడ్డికి ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అలిగారు. అందుబాటులో ఉన్న తన అనుచరులతో సమావేశమయ్యారు. ఆయన టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీలందరూ పార్టీని వీడినా తాను టీఆర్ఎస్ పై ఒంటరి పోరాటం చేశానని ఆయన గుర్తు చేస్తున్నారు. తన పోరాటాన్ని అధినేత చంద్రబాబు గుర్తించకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. అరికెల అలక కారణంగా ఈనెల 25న నిర్వహించ తలపెట్టిన నిజామాబాద్ జిల్లా మినీ మహానాడు రద్దయ్యే అవకాశముంది. -
'పాత పథకాలకే కొత్త పేర్లు'
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ లో కొత్తదనం ఏమీ లేదని టీడీపీ నేత అరికెల నర్సారెడ్డి పెదవి విరిచారు. పాత పథకాలకే కొత్త పేర్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చెరువుల అభివృద్ధి కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం కొత్తది కాదన్నారు. దీని ద్వారా అదనంగా ఒక్క టీఎంసీ నీళ్లు కూడా రావని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రయత్నం చేస్తున్నామని చెప్పకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ఈ ప్రాజెక్టును ఎత్తివేస్తారనే భయం కలుగుతోందన్నారు. పంచదార పరిశ్రమల గురించి ప్రస్తావించలేదన్నారు. -
ఢీ ‘దేశం’ గీ దండోరా
ఇందూరు: తెలుగుదేశం పార్టీ శనివారం నగరంలోని శివాజీనగర్ మున్నూరుకాపు కల్యాణ మండపంలో నిర్వహించిన జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ, ఎంఆర్పీఎస్ కార్యకర్తల ఘర్షణతో అయోమయం నెలకొంది. ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సభకు అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ప్రసంగం కొనసాగుతుండగా ఎంఆర్పీఎస్ నాయకులు ఒక్కసారిగా వేదిక మీదకు దూసుకు వచ్చారు. అక్కడ ఉన్న ఫ్లెక్సీని తొలగించి. బల్లలను విసిరేశారు. దీంతో తొలుత నిర్ఘాంతపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనంతరం ఆగ్రహంతో ఊగిపోయారు.ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. కుర్చీలతో చావబాదారు. నాల్గవ, ఐదవ పట్టణ ఎస్ఐలు మధు, సైదయ్య వెంటనే వెళ్లి వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారికి సైతం దెబ్బలు తగిలాయి. స్వల్పంగా లాఠీచార్జి చేసి ఎంఆర్పీఎస్ నాయకులను అరెస్టు చేసి తీసుకెళుతున్న పోలీసులపై టీడీపీ నాయకులు కుర్చీలు విసిరారు. గేటు వద్ద కాపుగాసి మరికొంత మంది ఎంఆర్‌పీఎస్‌నాయకులు సమావేశం ప్రవేశమార్గం వద్ద ఉన్న వాహనాలపై దాడిచేశారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కారు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు వారిని కూడా అరెస్టు చేసి నగర ఐదవ ఠాణాకు తరలించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో వేదికపై ఉన్న టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. కేవలం 15 నిమిషాలలోనే 20 మందికిపైగా ఎంఆర్‌పీఎస్‌నాయకులు సమావేశాన్ని రసాభాసాగా మార్చేశారు. కుర్చీలు ధ్వంసమయ్యాయి. సమావేశం అదుపు తప్పింది. టీడీపీ నాయకులు ఎంఆర్పీఎస్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. వేదికపై ఉన్న టీడీపీ నేతలు రమణ, రేవంత్‌రెడ్డి ఘటన చూస్తు విస్తుపోయా రు. ఈ క్రమంలో ఎమ్మె ల్సీ అరికెల నర్సారెడ్డి వారిం చినప్పటికీ టీడీపీ నాయకు లు, కార్యకర్తలు ఎంఆర్పీఎస్ నాయకులపై దాడి చేశారు. ఆరుగురు అరెస్టు నిజామాబాద్ సిటీ: తెలుగుదేశం పార్టీ సమావేశంలోకి దూసుకువచ్చి గొడవ చేసిన ఆరుగురు ఎంఆర్పీఎస్ నాయకులను అరెస్టు చేసినట్లు నాల్గవ టౌన్ ఎస్ఐ మధు తెలిపారు. వర్ని రోడ్డు శివాజీనగర్ ము న్నూర్కాపు సంఘంలో జరుగుతున్న సభలోకి ఎంఆర్పీఎస్ నాయకులు గందమాల నాగభూషణం, మైలారం బాలు, కిష్టయ్య, శ్రీనివాస్, సంతోష్, భూమన్న చొచ్చుకు వచ్చి అంతరాయం కలిగించారని అన్నారు. కుర్చీలు విసిరేసిటీడీపీ నాయకులు, కార్యకర్తలతో గొడవపడ్డారని వివరించారు. పై ఆరుగురిపై కేసు నమోదు చేసామన్నారు. -
సోలార్ విద్యుత్ పేరుతో మోసం
జక్రాన్‌పల్లి : సోలార్ విద్యుత్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి విమర్శించారు. ఆదివారం మండలంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అ నంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్‌కు రూ.3లక్షల 10 వేలు ఖర్చవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారన్నారు. అంతేగాక తన స్వగ్రామంలో రూ. మూడు లక్షల 10 వేలతో సోలార్ విద్యుత్ పరికరాలను అమర్చానని ఎంతో విజయవంతంగా పనిచేస్తోందని ప్రతి ఒక్క రైతు సోలార్ విద్యుత్‌ను వాడాలని చెప్పారన్నారు. సోలార్ విద్యుత్‌కు కేంద్ర ప్రభుత్వం 30శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20శాతం, రైతు యాభై శాతం చెల్లించి సోలార్ పరికరాన్ని పొందాలని సూచించారన్నారు. ఇందులో రైతు వాటా యాభై శాతం చెల్లిస్తే రూ.లక్షా 50 వేలకు వచ్చేదన్నారు.కానీ ప్రభుత్వం నెడ్కాప్ సంస్థకు వ్యవసాయ సోలార్ విద్యుత్‌కు రూ.4లక్షల90 వేలు చెల్లించడానికి టెండర్లను ఖరారు చేసిందన్నారు. ఈ లెక్కన రూ. 2 లక్షల 45 వేలను రైతు చె ల్లించాల్సి వస్తోందన్నారు. ఇందులో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో జిల్లా మంత్రి సమాధానం చెప్పాలన్నారు. విద్యుత్ సమస్య కారణంగా రాష్ట్రంలో 550 మంది,జిల్లాలో 33 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. దీనికి ప్రభుత్వ అసమర్థతే కారణమన్నారు. ఆసరా పథకం వృద్ధులకు భరోసా లేకుండా పోయిందన్నారు. ఉచిత విద్యుత్ పూర్తిగా గాలికి వదిలేశారని అన్నారు. పక్కా ఇళ్ల పథకం పత్తాలేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం నడుచుకోవడం లేదన్నారు. అందుకే ప్రజలు అనేక కష్టనష్టాలను చవి చూడాల్సి వస్తోందన్నారు. ప్రజల సంక్షేమం పరిపాలన విధానం ఒక్క టీడీపీతోనే సాధ్యమన్నారు.