జక్రాన్‌పల్లి : సోలార్ విద్యుత్ పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి విమర్శించారు. ఆదివారం మండలంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అ నంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్‌కు రూ.3లక్షల 10 వేలు ఖర్చవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారన్నారు. అంతేగాక తన స్వగ్రామంలో రూ. మూడు లక్షల 10 వేలతో సోలార్ విద్యుత్ పరికరాలను అమర్చానని ఎంతో విజయవంతంగా పనిచేస్తోందని ప్రతి ఒక్క రైతు సోలార్ విద్యుత్‌ను వాడాలని చెప్పారన్నారు. సోలార్ విద్యుత్‌కు కేంద్ర ప్రభుత్వం 30శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20శాతం, రైతు యాభై శాతం చెల్లించి సోలార్ పరికరాన్ని పొందాలని సూచించారన్నారు.
ఇందులో రైతు వాటా యాభై శాతం చెల్లిస్తే రూ.లక్షా 50 వేలకు వచ్చేదన్నారు.కానీ ప్రభుత్వం నెడ్‌కాప్ సంస్థకు వ్యవసాయ సోలార్ విద్యుత్‌కు రూ.4లక్షల90 వేలు చెల్లించడానికి టెండర్లను ఖరారు చేసిందన్నారు. ఈ లెక్కన రూ. 2 లక్షల 45 వేలను రైతు చె ల్లించాల్సి వస్తోందన్నారు. ఇందులో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో జిల్లా మంత్రి సమాధానం చెప్పాలన్నారు. విద్యుత్ సమస్య కారణంగా రాష్ట్రంలో 550 మంది,జిల్లాలో 33 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. దీనికి ప్రభుత్వ అసమర్థతే కారణమన్నారు. ఆసరా పథకం వృద్ధులకు భరోసా లేకుండా పోయిందన్నారు. ఉచిత విద్యుత్ పూర్తిగా గాలికి వదిలేశారని అన్నారు. పక్కా ఇళ్ల పథకం పత్తాలేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం నడుచుకోవడం లేదన్నారు. అందుకే ప్రజలు అనేక కష్టనష్టాలను చవి చూడాల్సి వస్తోందన్నారు. ప్రజల సంక్షేమం పరిపాలన విధానం ఒక్క టీడీపీతోనే సాధ్యమన్నారు.
సోలార్ విద్యుత్ పేరుతో మోసం
Published Mon, Nov 24 2014 3:00 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM
Advertisement