హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కుంభకోణంలో కూరుకుపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆరోపించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. పోచారం తాను చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని భట్టి ఈ సందర్భంగా మండిపడ్డారు. రాష్ట్రంలో మాఫీ చేయాల్సిన రుణాలను టీఆర్ఎస్ సర్కార్ తగ్గించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు రూ.6 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని తెలిపారు. రుణమాఫీ సంపూర్ణంగా అమలు కాకపోతే రైతులపై కొత్త రుణాల వడ్డీ భారం పడుతుందని భట్టి గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష వెంటనే మాఫీ చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. లేనట్టయితే ఆ రుణాలను ప్రభుత్వ లోన్లుగా మార్చాలని భట్టి సూచించారు.
'పోచారం కుంభకోణంలో కూరుకుపోయారు'
Published Fri, Jun 5 2015 2:09 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM
Advertisement
Advertisement