సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ బోర్డ్ అవకతవకలపై కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబరినా సంస్థకు, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకపోతే వెంటనే ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అర్హత, అనుభవం లేని గ్లోబరినా సంస్థకు అప్పజెప్పి లక్షలాది మంది విద్యార్థుల జీవితాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై, ఇంటర్ బోర్డ్ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబరినా సంస్థపై కేసు నమోదైనప్పటికీ తెలంగాణలో ఆ సంస్థకు బాధ్యతలు ఎలా అప్పగించారని నిలదీశారు. ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల స్వప్రయోజనాల కోసమే అలా చేశారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment