
అసెంబ్లీకి బడ్జెట్ పత్రాలతో ఈటెల
తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందేలా బడ్జెట్ ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందేలా బడ్జెట్ ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి కల్పనలే తమ ప్రభుత్వ ఎజెండా అన్నారు. బుధవారం ఉదయం ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
తొలిసారి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. తొలి ఏడాది పది నెలలకు బడ్జెట్ తయారు చేసిన టీఆర్‌ఎస్ సర్కారు... ఈసారి పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను రూపొందించింది. ఐదు నెలల వ్యవధిలోనే రెండోసారి రెండో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడం గమనార్హం. అలాగే శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.