హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో బుధవారం వివిధ అంశాలపై రాజకీయ పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. దేవాలయాల్లో అర్చకులు, సిబ్బందికి ట్రెజరీ ద్వారా వేతనాల చెల్లింపు అంశంపై బీజేపీ, మూతపడ్డ పరిశ్రమల పునరుద్దరణ అంశంపై సీపీఐ, లేబర్ యాక్ట్ ప్రకారం కార్మికుల వేతనాల చెల్లింపు అంశంపై సీపీఎం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. కాగా తెలంగాణ అసెంబ్లీ నేడు పీఏసీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేయనుంది. తెలంగాణకు అనుగుణంగా నిబంధనల్లో మార్పులు చేయనుంది.