లాస్ట్ ఇయర్ బడ్జెట్ను కాపీ, పేస్ట్ చేశారా?
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎలాంటి కొత్తదనం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అన్నారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన సోమవారం సభలో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో స్పష్టత లేదని విమర్శించారు. గత ఏడాది బడ్జెట్నే కాపీ, పేస్ట్ చేశారని అక్బరుద్దీన్ విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను భారీగా పెంచి చూపారని ఆయన అన్నారు.