టీఆర్‌ఎస్‌లో టీడీపీని విలీనం చేసినట్లు శాసన మండలిలో చైర్మన్ ప్రకటించడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. టీడీపీ నుంచి ఏడుగురు సభ్యుల్లో ఐదుగురు టీఆర్‌ఎస్‌లో విలీనమైన తర్వాత.. ఇంకా ఇద్దరం మిగిలాం. మరి మాది ఏ పార్టీ అనేది సభ్యులే చెప్పాలి.
మాది ఏ పార్టీనో చెప్పండి?
టీఆర్‌ఎస్‌లో టీడీపీని విలీనం చేసినట్లు శాసన మండలిలో చైర్మన్ ప్రకటించడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. టీడీపీ నుంచి ఏడుగురు సభ్యుల్లో ఐదుగురు టీఆర్‌ఎస్‌లో విలీనమైన తర్వాత.. ఇంకా ఇద్దరం మిగిలాం. మరి మాది ఏ పార్టీ అనేది సభ్యులే చెప్పాలి. పెద్దల సభ ఆదర్శంగా ఉండాలి. కానీ అగౌరవ పరుస్తున్నారు. కౌన్సిల్ ఉంది టీఏ,డీఏల కోసం కాదు. విలీనంపై కోర్టుకు వెళ్లి అక్కడే తేల్చుకుంటాం.. న్యాయం జరిగేదాకా పోరాడతాం. - అరికెల నర్సారెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ
ఫిరాయింపులనుప్రోత్సహిస్తున్న టీఆర్‌ఎస్
టీఆర్‌ఎస్ ప్రభుత్వం పథకం ప్రకారమే ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రకారం.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభ్యులపై అనర్హత వేటు పడాలి. కానీ ఇది ఎక్కడా జరగడం లేదు. పైగా.. టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసినట్లు బులిటెన్ విడుదల చేశారు. అధికార దుర్వినియోగానికి ఇంతకంటే సాక్ష్యం మరేం ఉంటుంది. - పొట్ల నాగేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్సీ
ఈ ప్రభుత్వానికి సోయి లేదు
రైతు ఆత్మహత్యలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్పం దించడం లేదు. తమ ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి 69 మంది రైతులే ఆత్మహత్య చేసుకున్నారని టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్సీలు చెబుతున్నారు. కానీ, 500కు పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు మావద్ద రిపోర్ట్ ఉంది. రోజుకు ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా.. ఈ ప్రభుత్వానికి సోయి లేదు. దీనిపై వ్యవసాయ శాఖమంత్రి రైతులను కించపరిచేలా మాట్లాడుతుండడం సిగ్గుచేటు. - షబ్బీర్ అలీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ
ఆత్మహత్యలపై కమిటీ వేయండి
ఒక పక్క రైతు ఆత్మహత్యలు, మరోపక్క విద్యుత్ కోతలు, గిట్టుబాటు లేని ధరలు, రాష్ట్రంలోని 80 శాతం మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్‌ఎస్ అధికారం చేపట్టాక 740 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలతో రైతు స్వరాజ్య వేదిక నివేదిక ఇచ్చింది. వీటిపై స్పందించకపోగా.. చివరకు ఆత్మహత్యలనూ కించపరుస్తున్నారు. రైతు ఆత్మహత్యలపై ఓ కమిటీ వేయండి. - పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ .