'ప్రతిపక్షాల గొంతు నొక్కేయత్నం'
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో సాక్షాత్తూ సభాపతే ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. సభాపతిగా సభ్యులకు సమ న్యాయం చేయాల్సింది పోయి అధికార పక్షానికి వంత పాడుతున్నారు. అధికారపక్షం సభ్యురాలు గొంగిడి సునిత మద్యం వ్యాపారిని అసెంబ్లీ లాబీకి తీసుకొచ్చి మూసివేసిన దుకాణాన్ని తెరిపించేందుకు సంబంధిత మంత్రి వద్ద పైరవీలు చేసినట్లు పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయి. ఆ వ్యాపారిని ఎలా అనుమతించారని, స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు.
- డీకే అరుణ, సంపత్‌కుమార్, భాస్కర్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు