sampathkumar
-
‘సోనియా భిక్షతోనే కేసీఆర్, కేటీఆర్ అధికారం అనుభవిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తామని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియా భిక్షతోనే కేసీఆర్, కేటీఆర్ అధికారం అనుభవిస్తున్నారని, చరిత్ర మరిచేపోయి మాట్లాడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. రేవంత్ టీడీపీకి రాజీనామా చేసిన తర్వాతే కాంగ్రెస్‌లో చేరారని, సంతలో కొన్నట్లు నాయకులను కొనేవాళ్లా కాంగ్రెస్ గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు రేవంత్ రాష్ట్ర అధ్యక్షులయ్యారు.. కేటీఆర్ కేవలం ప్రాంతీయ పార్టీకే వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కల్వకుంట్ల డబ్బు సంచులకు అమ్ముడుపోయిన 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుదారులను వదిలిపెట్టమని ఆయన అన్నారు. -
‘కేసీఆర్‌కు భవిష్యత్‌లో జైలు తప్పదు’
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు దారుణంగా ఉందని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సార్థకతలేని అసెంబ్లీ సమావేశాలు ఒక్క తెలంగాణలోనే జరుగుతున్నాయని విమర్శించారు. కేసీఆర్.. అసెంబ్లీని తన రాజరికపు, కుటుంబ వ్యవహారంగా నడుపుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో బిల్లులపై పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా చర్చ జరిపే పరిస్థితులు లేవన్నారు. ప్రశ్నించే వారిని కేసీఆర్ అణిచివేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ తన ఇంట్లో తీసుకునే నిర్ణయాలను అసెంబ్లీలో ఆమోదింపజేసుకుంటూ.. శాసనసభకు కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తీసుకురాబోయే మున్సిపల్ చట్టంలో ఏముందో ఆయన కుటుంబానికి తప్ప మిగతావారెవ్వరికి తెలియదన్నారు. మంత్రులు సైతం కేబినెట్ భేటీలో వరుసగా నిలబడి సంతకాలు పెట్టడం తప్ప.. ఏంటని ప్రశ్నించే పరిస్థితులు లేవన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా కుంటుపడిందని చెప్పారు. రైతుబంధు డబ్బులు సమయానికి అందక రైతులు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రజల సొమ్మును తన రాజకీయ అవసరాలకు వాడుకుంటున్న కేసీఆర్‌కు భవిష్యత్‌లో జెలు తప్పదని హెచ్చరించారు. థాయిలాండ్ ప్రధానికి పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందన్నారు. ఎన్నికలు, రాజకీయాలు తప్ప వేరే అంశాలను పట్టించుకోని కేసీఆర్‌కు భవిష్యత్‌లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని సంపత్‌కుమార్ అన్నారు. -
అసెంబ్లీ, న్యాయ కార్యదర్శులకు జ్యుడీషియల్ కస్టడీ!
సాక్షి, హైదరాబాద్: గత అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ. సంపత్‌కుమార్‌ల బహిష్కరణ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కోర్టు ధిక్కార ఆరోపణలపై శుక్రవారం విచారణకు హాజరైన న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్‌రావు, శాసనసభ కార్యదర్శి వి. నరసింహాచార్యులను హైకోర్టు.. రిజిస్ట్రార్ (జ్యుడీషి యల్) కస్టడీకి అప్పగించింది. తదుపరి విచారణకు హాజరవుతామన్న లిఖితపూర్వక హామీతోపాటు రూ. 10వేల వ్యక్తిగత పూచీకత్తులపై వారిని కస్టడీ నుంచి విడుదల చేసింది. కార్యదర్శుల స్థాయి అధికారులను ఇలా కస్టడీలోకి తీసుకోవడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు ఈ కేసులో అప్పటి స్పీకర్ మధుసూదనాచారిని 6వ ప్రతివాదిగా చేర్చింది. కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణను రద్దు చేస్తూ తాము తీర్పిచ్చినా వారి సభ్యత్వాలను ఎందుకు పునరుద్ధరించలేదో చెప్పాలని మధుసూదనాచారిని ఆదేశించింది. అలాగే కోమటిరెడ్డి, సంపత్‌లకు గన్మెన్లను పునరుద్ధరించాలన్న ఆదేశాలను బేఖాతరు చేసినందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా ఎస్పీ ఆవుల వెంకట రంగనాథన్, అప్పటి జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరిలకు కోర్టు ధిక్కారం చట్టం ఫారం–1 నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు ఆదేశాలిచ్చారు. గత విచారణ సమయంలో తనపట్ల ‘వాటీజ్ దిస్ నాన్సెన్స్’అంటూ నోరుపారేసుకున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె. రామచంద్రరావు తీరును న్యాయమూర్తి ఆక్షేపించారు. చేసిన తప్పుకు ఏఏజీ కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారని భావించానని, అయితే ఆయనలో ఏ పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు. సరైన సమయంలో రామచంద్రరావుపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ మొత్తం వ్యవహారాన్ని సుప్రీంకోర్టుకు నివేదిస్తానన్నారు. కోర్టు ధిక్కార చట్టం కింద కోర్టు ముందు హాజరు కావాల్సిన వారంతా హాజరైతే ఆ తరువాత సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించి కేసును మూసివేయాలా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తానన్నారు. తదుపరి విచారణను మార్చి 8కి వాయిదా వేశారు. మధుసూదనాచారితోపాటు డీజీపీ, ఇద్దరు ఎస్పీలు మార్చి 8న వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారని భావిస్తున్నానని న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టు తీర్పు అమలు చేయరా...? కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లను సభ నుంచి బహిష్కరిస్తూ గత అసెంబ్లీ తీర్మానాన్ని, వారి అసెంబ్లీ స్థానాలను ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ జస్టిస్ శివశంకరరావు గతేడాది తీర్పిచ్చారు. వారి శానససభ్యత్వాలను పునరుద్ధరించాలని, గన్‌మెన్ సౌకర్యాన్ని కూడా పునరుద్ధరించాలని ఆదేశించారు. అయితే ఈ తీర్పును అమలు చేయకపోవడంతో అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులతోపాటు డీజీపీ, ఇద్దరు ఎస్పీలపై కోమటిరెడ్డి, సంపత్‌లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గత శుక్రవారం విచారణకు రాగా నిరంజన్‌రావు, నరసింహాచార్యులు కోర్టు ముందు హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి... వారిద్దరికీ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. వారిని తమ ముందు హాజరుపరచాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. శుక్రవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చిన సందర్భంగా నిరంజన్‌రావు, నరసింహాచార్యులు కోర్టు ముందు హాజరవడంతో వారిని రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)కస్టడీకి అప్పగించి ఆ తర్వాత బాండ్లపై విడుదలకు ఆదేశించారు. కేంద్ర హోంశాఖను ఆదేశిస్తాం... ఈ కేసులో అప్పటి స్పీకర్ మధుసూదనాచారికి జారీ చేసిన నోటీసును తిరస్కరించడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. ఇలాగే కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోని అప్పటి మణిపూర్ స్పీకర్ డాక్టర్ హెచ్. బోరోబాబుసింగ్ను తమ ముందు హాజరుపరచాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర హోంశాఖను ఆదేశించిందని గుర్తుచేశారు. స్పీకర్ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకాకపోతే ఆయన్ను తమ ముందు హాజరుపరచాలని కేంద్ర హోంశాఖను ఆదేశించే అధికారం కోర్టుకు ఉందని తెలిపారు. డీజీపీ విషయంలోనూ ఇలాంటి ఆదేశాలు ఇవ్వొచ్చునన్నారు. మధుసూదనాచారిది కోర్టు ధిక్కారమే... కోర్టు నోటీసును తిరస్కరించడం, సభ్యత్వాల పునరుద్ధరణలో కోర్టు తీర్పును అమలు చేయకపోవడం ద్వారా అప్పటి స్పీకర్‌గా మధుసూదనాచారి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని న్యాయమూర్తి అన్నారు. ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నారు. కోర్టు ఆయనకు నోటీసు జారీ చేసిందని, అందువల్ల కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయలేదో వివరించాలని మధుసూదనాచారిని ఆదేశించారు. కోర్టు ధిక్కారం కింద ఎందుకు శిక్షించరాదో వివరణ ఇవ్వాలన్నారు. అందులో భాగంగా ఆయనను ఈ ధిక్కార వ్యాజ్యంలో 6వ ప్రతివాదిగా చేరుస్తున్నట్లు తెలిపారు. డీజీపీ, ఇద్దరు ఎస్పీలు సైతం నోటీసులకు స్పందించనందున వారికి ఫారం–1 నోటీసు ఇస్తున్నట్లు తెలిపారు. గత విచారణ సమయంలో నోరుపారేసుకున్న అదనపు ఏజీ జె.రామచంద్రరావుకు నోటీసు జారీ చేసేందుకు న్యాయమూర్తి సిద్ధమయ్యారు. అదనపు ఏజీతో తాను ఈ అంశంపై చర్చిస్తానని, అప్పటివకు నోటీసు జారీని వాయిదా వేయాలని నరసింహాచార్యుల తరఫు సీనియర్ న్యాయవాది వెంకటరమణ కోరగా జడ్జి అంగీకరించారు. గత విచారణప్పుడు ఉత్తర్వుల్లో పేర్కొన్న సంవత్సరాన్ని తాను తప్పుగా చెప్పడంపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ శరత్ ఎగతాళి చేశారని, అయినా తాను ఆ విషయాన్ని మనసులో పెట్టుకోవడం లేదన్నారు. -
కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం
సాక్షి, అలంపూర్: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని తాజా మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సతీమణి మహాలక్ష్మి అన్నారు. అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇమాంపురంలో గురువారం తాజా మాజీ సతీమణి సంపత్ కుమార్ సతీమణి మహాలక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అడ్డాకుల రాము, రుక్ముద్దిన్, ఇంతియాజ్ అలీ ఉన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు ఏక కాలంలోనే రెండు లక్షల రుణమాఫీ వర్తింపజేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి, తాజా మాజీ ఎమ్మెల్యే సంతప్‌కుమార్ అన్నారు. అలంపూర్ మండలంలోని లింగనవాయి, క్యాతూర్‌లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఇంటింటి ప్రచారం, రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్థించారు. మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాముడు, జయరాముడు పాల్గొన్నారు. శాంతినగర్: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు చేసిందేమిలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు అన్ని విధాలా చేయూతనందిస్తామని తాజా మాజీ ఎమ్మెల్యే సతీమణి మహాలక్ష్మి అన్నారు. వడ్డేపల్లి మండలంలోని బుడమొర్సులో ఇంటింటి ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే సతీమణి మాట్లాడారు. ఏడాదికి ఆరు సిలిండర్లు, ప్రతి మహిళా సంఘానికి రూ.లక్ష గ్రాంటు తదితర పథకాలను వివరించారు. పేదల పక్షపాతి.. ఇటిక్యాల: పేదలకు అన్ని విధాలుగా అండదండలు అందించేది కాంగ్రెస్ పార్టీయేనని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని ఉదండాపురం, సాతర్ల, వావిలాల, శివనాం పల్లి, పెద్దదిన్నె, గోపాల్ దిన్నె గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం వీఎస్టీ కంపెనీ స్టేజీ వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద మండలంలో పలు గ్రామాల యువత సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రిజర్వాయరును నిర్మిస్తాం... వచ్చే డిసెంబరు మాసంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంను ఏర్పాటు చేస్తుందని అప్పుడు సాగునీటికి పెద్దపీట వేస్తామని అన్నారు. ఆయన వెంట లక్ష్మినారయణ రెడ్డి, అనంతరెడ్డి, సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి, పరమేశ్వరెడ్డి, ఎర్రసత్యం, నర్సింహులు ఉన్నారు. మానవపాడు: మండల పరిధిలోని పెద్దపోతులపాడులో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. తాజా మాజీ ఎమ్మెల్యే సతీమణి మహాలక్ష్మి గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. బోరవెల్లి శేషిరెడ్డి, జగన్మోహన్, రవి, గ్రామ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి అయిజ: కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఏఐసీసీ కార్యదర్శి, తాజా మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని యాపదిన్నె, గుడుదొడ్డి, వెంకటాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సంపూర్ణంగా నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలకు మేలు రాజోళి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గురువారం మండల కేంద్రంలో వారు ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగుల నుంచి వృద్ధుల సంక్షేమం వరకు అందరి కోసం చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాల గురుంచి తెలిపారు. జయన్న, దస్తగిరి, సుధాకర్ రెడ్డి, షాలు, చల్లా యూత్ నాయకులు సోమశేఖర్ రెడ్డి, అశోక్ రెడ్డి, హసన్ పాల్గొన్నారు. -
ధిక్కరణ’పై నేడు హైకోర్టు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు తీర్పును అమలు చేయనందుకు అసెంబ్లీ కార్యదర్శి వి.నర సింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులకు కోర్టు ధిక్కారం కింద ఫాం 1 నోటీసులు జారీ చేసే విషయంపై హైకోర్టు తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ను శాసన సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, వారి అసెంబ్లీ స్థానాలను ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ తదనుగుణంగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ జస్టిస్ శివశంకరరావు తీర్పునిచ్చారు. తీర్పును అమ లు చేయకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ శివశంకరరావు మరోసారి విచారణ జరిపి కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశామని, తీర్పుపై స్టే కోరు తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశా మని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యుల తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వివరించారు. కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన తరువాత ఇద్దరు కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేశారని కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫు న్యాయవాది తెలిపారు. జస్టిస్ శివశంకరరావు ఇరువురు కార్యదర్శులకు కోర్టు ధిక్కారం కింద ఫాం 1 నోటీసులు జారీ చేసే విషయంపై మంగళవారం నిర్ణయం వెలువరిస్తానని ప్రకటించారు. -
హామీలు నెరవేర్చకుండా అలంపూర్కా?: సంపత్
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అలంపూర్ నియోజకవర్గ పర్యటనకు ఎలా సిద్ధమవుతున్నారని సీఎం కేసీఆర్‌ను అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ప్రశ్నిం చారు. గురువారం ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా జోగుళాంబ దేవస్థాన ఆధునీకరణకు హామీ ఇచ్చారని, ఆర్డీఎస్ ప్రాజెక్ట్ శాశ్వత పరిష్కారం, పీజేపీ లింక్ కెనాల్ అభివృద్ధి, నెట్టంపాడు ప్రాజెక్ట్పూర్తిసహా నియోజకవర్గ సమస్యలపై అనేక హామీలు ఇచ్చారని వీటిలో ఏ ఒక్కటి కూడా అమలు పరచకుండా అలంపూర్ పర్యటనకు ఎలా వస్తారని లేఖలో ప్రశ్నించారు. -
భద్రత పునరుద్ధరణపై వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: తమ శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ జారీ చేసిన తీర్మానాన్ని హైకోర్టు రద్దు చేసినా, భద్రతను పునరుద్ధరించలేదని, తమకు గతంలో ఉన్న విధంగానే భద్రతను కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, వారికి భద్రతను కొనసాగించే విషయంపై పూర్తి వివరాలను తమ ముం దుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, నల్లగొండ, జోగులాంబ గద్వాల ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి సోమవారం ఉత్తర్వు లు జారీ చేశారు. శాసనసభ్యత్వాల రద్దును కోర్టు తప్పుపడుతూ, రద్దు తీర్మానాన్ని కొట్టేసిందని తమ పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో తమకు 2+2 గన్ మెన్లు ఉండేవారని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భద్రతను పునరుద్ధరించడం లేదన్నారు. -
ఏజీ లేరు.. నాకు సంబంధం లేదు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ శాసన సభ్యత్వాల రద్దు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలకంగా మారిన వీడియో ఫుటేజీలను హైకోర్టుకు సమర్పించే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా సంకేతాలు పంపింది. సీసీ కెమెరా ఫుటేజీలు ఇవ్వడంపై అసెంబ్లీ తీర్మానం చేయలేదు గనుక.. వాటిని అందజేయలేమని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు మంగళవారం హైకోర్టుకు నివేదించారు. వీడియో ఫుటేజీలు సమర్పిస్తామన్న ఏజీ హామీతో తనకు సంబంధం లేదని, తాను కేవలం ప్రభుత్వం తరఫున హాజరవుతున్నానని, అసెంబ్లీ తరఫున ఎవరు హాజరవుతారో తనకు తెలియదని పేర్కొన్నారు. అయితే ఏఏజీ వివరణపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఫుటేజీలు అందుబాటులో ఉన్నా కూడా కోర్టుకు సమర్పించని పక్షంలో.. అందులోని అంశాలు వ్యతిరేకంగా ఉన్నాయని భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటు నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేస్తూ.. న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏజీ లేరు.. నాకు సంబంధం లేదు.. తమ శాసన సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను గాయపరిచామన్న ఆరోపణలతో చర్యలు తీసుకున్న నేపథ్యంలో.. ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలను కోర్టు ముందుంచేలా ఆదేశించాలని వారు కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు విచారణ చేపట్టారు. దీనికి ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ (ఏజీ).. అసెంబ్లీలో ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలు సమర్పిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. అనంతరం ఈ నెల 22న మరోసారి విచారణ జరగగా.. అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) రామచంద్రరావు హాజరయ్యారు. ఫుటేజీ సమర్పించాలంటే అసెంబ్లీ తీర్మానం అవసరమని, అందుకు గడువు ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో గడువిచ్చిన న్యాయమూర్తి.. మంగళవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏఏజీ రామచంద్రరావు స్పందిస్తూ... అసలు ఈ వ్యవహారంలో అసెంబ్లీకి నోటీసులు జారీ చేసే న్యాయ పరిధి హైకోర్టుకు లేదని వివరించారు. ఈ కేసులో తాను అసెంబ్లీ తరఫున హాజరుకావడం లేదని, కేవలం ప్రభుత్వం తరఫునే హాజరవుతున్నానని చెప్పారు. సభ తరఫున ఎవరు హాజరవుతారో తనకు తెలియదన్నారు. అయితే ఫుటేజీ సమర్పిస్తామని ఏజీ హామీ ఇచ్చారు కదా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా... అప్పుడు ఏజీ ఇచ్చిన హామీతో తనకు సంబంధం లేదన్నారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. ఏజీ ఇచ్చిన హామీకి విలువ ఉంటుందని, ప్రభుత్వం కూడా శాసనవ్యవస్థలో భాగమని కోర్టుకు చెప్పారు. ఏజీ హామీకి ప్రభుత్వం, అసెంబ్లీ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ఫుటేజీ సమర్పిస్తున్నారా.. లేదా..? ఏఏజీ వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. ఇంతకీ ఫుటేజీ సమర్పిస్తున్నారా? అని ప్రశ్నించారు. దాంతో అదనపు ఏజీ స్పందిస్తూ.. ఫుటేజీ ఇవ్వాలంటే అసెంబ్లీ తీర్మానం అవసరమని, తీర్మానం చేయలేదు కాబట్టి కోర్టుకు ఫుటేజీ ఇవ్వలేమని చెప్పారు. ఈ విషయాన్ని మెమో ద్వారా రాతపూర్వకంగా వివరించారా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. తాను సభ తరఫున హాజరుకావడం లేదు కాబట్టి మెమో దాఖలు విషయంలో ఏమీ చెప్పలేనని ఏఏజీ పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వీడియో ఫుటేజీ లభ్యమవుతున్నప్పటికీ దానిని కోర్టుకు సమర్పించని పక్షంలో.. ఆ వీడియో ఫుటేజీలోని అంశాలు మీకు (అసెంబ్లీ కార్యదర్శికి) వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టే ఇవ్వడం లేదని భావించాల్సి ఉంటుంది. ఇలా భావించవచ్చునంటూ 1968లో గోపాల్, కృష్ణాజీ కేత్కర్ వర్సెస్ మహ్మద్ హాజీ లతీఫ్ తదితరుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టం చేసింది. మీరు వీడియో ఫుటేజీలను సమర్పించని పక్షంలో.. ఆ ఫుటేజీలోని అంశాలు మీకు (అసెంబ్లీ కార్యదర్శికి) వ్యతిరేకంగా ఉన్నట్టు భావిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది..’’అని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. ఇందుకు నాలుగు వారాలు గడువు కావాలని ఏఏజీ కోరగా.. న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇప్పటికే తగినంత సమయమిచ్చామని, ఏప్రిల్ 3వ తేదీ నాటికి కౌంటర్లు దాఖలు చేయాల్సిందేనని స్పష్టం చేస్తూ.. విచారణను వాయిదా వేశారు. -
‘హత్య చేసేందుకే గన్మెన్లు తొలగించారు’
శంషాబాద్ : అర్ధరాత్రి గన్మెన్లను తొలగించడం మమ్మల్ని హత్య చేసేందుకేనని అనర్హత వేటుపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లు ఆరోపించారు. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్లపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో వారు కేంద్ర ఎన్నికల కమిషనర్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసేందుకు బుధవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అంతకు ముందు ఎయిర్‌పోర్టులో విలేకరులతోమాట్లాడుతూ.. టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని, త్వరలో జరగబోయే ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదని, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఒక్క నిరుద్యోగికీ ఉద్యోగం ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని అనుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. కాంట్రాక్టులు ఆంధ్రాప్రాంత నాయకులకు ఇచ్చి కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గవర్నర్ కుర్చీలను లాగేసి, శాసనమండలిలో టేబుల్‌పై ఎక్కి కొట్టినప్పుడు ఎవరినీ కూడా అనర్హులుగా ప్రకటించలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దుచేసే హక్కు ఈయనకు ఎక్కడిదని సూటిగా అడిగారు. -
'కేసీఆర్ వాస్తవాన్ని విస్మరిస్తున్నారు'
హైదరాబాద్: ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను ముట్టడించిన విద్యార్థులను అరెస్ట్ చేయడం దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే(అలంపూర్) సంపత్ కుమార్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయరా అని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థుల ఉద్యమాల వల్లే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చామన్న వాస్తవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విస్మరిస్తున్నారని సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'ప్రతిపక్షాల గొంతు నొక్కేయత్నం'
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో సాక్షాత్తూ సభాపతే ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. సభాపతిగా సభ్యులకు సమ న్యాయం చేయాల్సింది పోయి అధికార పక్షానికి వంత పాడుతున్నారు. అధికారపక్షం సభ్యురాలు గొంగిడి సునిత మద్యం వ్యాపారిని అసెంబ్లీ లాబీకి తీసుకొచ్చి మూసివేసిన దుకాణాన్ని తెరిపించేందుకు సంబంధిత మంత్రి వద్ద పైరవీలు చేసినట్లు పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయి. ఆ వ్యాపారిని ఎలా అనుమతించారని, స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. - డీకే అరుణ, సంపత్‌కుమార్, భాస్కర్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు