'కేసీఆర్ వాస్తవాన్ని విస్మరిస్తున్నారు'
హైదరాబాద్: ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ పబ్లిక్ సర్వీసు కమిషన్ను ముట్టడించిన విద్యార్థులను అరెస్ట్ చేయడం దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే(అలంపూర్) సంపత్ కుమార్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయరా అని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థుల ఉద్యమాల వల్లే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చామన్న వాస్తవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విస్మరిస్తున్నారని సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.