చెరువులు ‘ఇరిగేషన్’కు అప్పగించొద్దు
- టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకం పూర్తయ్యాక చెరువుల నిర్వహణ బాధ్యతను నీటిపారుదల శాఖకు అప్పగిస్తే అవి మళ్లీ నాశనమయ్యే ప్రమాదం ఉంటుందని టీఆర్‌ఎస్ సభ్యుడు చెన్నమనేని రమేశ్ అన్నారు. గురువారం పద్దులపై చర్చలో భాగంగా మిషన్ కాకతీయపై ఆయన శాసనసభలో ప్రసంగించారు. చెరువులపై ఆధారపడే కులవృత్తులవారి సం ఘాలు, గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో వాటి నిర్వహణ ఉండాలని, ఇతర ప్రభుత్వ విభాగాల ప్రతినిధులతో కూడిన కమిటీలతో సమష్టి నిర్వహణలోనే అవి వర్ధిల్లుతాయని పేర్కొన్నారు.