MLA Chennamaneni Ramesh
-
ఎమ్మెల్యే చెన్నమనేనికి ఊరట
సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారతీయ పౌరసత్వం రద్దుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లను హైకోర్టు ఆరు వారాలపాటు సస్పెండ్ చేసింది. దీనిపై మళ్లీ వాదనలు వింటామని హైకోర్టు స్పష్టంచేసింది. రమేష్ జర్మన్ దేశ పౌరుడని, ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు గతంలో విచారించింది. -
ఎమ్మెల్యే పౌరసత్వం కేసులో గడువు పెంపు
రాజన్న సిరిసిల్ల : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై తేల్చేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు మరోసారి గడువు ఇచ్చింది. రమేష్ జర్మన్ దేశ పౌరుడని, ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు గతంలో విచారించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్రానికి అప్పట్లో మూడు నెలల గడువు ఇచ్చింది. గడువు ముగియటంతో మరోసారి విచారణకు రాగా మరో మూడు నెలల సమయం పొడిగించాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ న్యాయస్థానాన్ని కోరారు. ఇందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. -
చెరువులు ‘ఇరిగేషన్’కు అప్పగించొద్దు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకం పూర్తయ్యాక చెరువుల నిర్వహణ బాధ్యతను నీటిపారుదల శాఖకు అప్పగిస్తే అవి మళ్లీ నాశనమయ్యే ప్రమాదం ఉంటుందని టీఆర్ఎస్ సభ్యుడు చెన్నమనేని రమేశ్ అన్నారు. గురువారం పద్దులపై చర్చలో భాగంగా మిషన్ కాకతీయపై ఆయన శాసనసభలో ప్రసంగించారు. చెరువులపై ఆధారపడే కులవృత్తులవారి సం ఘాలు, గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో వాటి నిర్వహణ ఉండాలని, ఇతర ప్రభుత్వ విభాగాల ప్రతినిధులతో కూడిన కమిటీలతో సమష్టి నిర్వహణలోనే అవి వర్ధిల్లుతాయని పేర్కొన్నారు. -
పౌరసత్వం కేసులో తీర్పు అమలు ఆపండి
ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టులో పిటిషన్ సాక్షి, హైదరాబాద్: భారతీయ పౌరసత్వం లేని కారణంగా ఎమ్మెల్యేగా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు వీలుగా తనకు నెల రోజులు గడువు ఇవ్వాలని కోర్టుకు ఆ పిటిషన్లో విన్నవించారు. తన వాదన వినకుండానే ఈ తీర్పు వెలువరించారని, దాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తన కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం జర్మనీలో చికిత్స పొందుతున్నానని పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.