పౌరసత్వం కేసులో తీర్పు అమలు ఆపండి | Citizen case: chennamaneni ramesh moves high court | Sakshi
Sakshi News home page

పౌరసత్వం కేసులో తీర్పు అమలు ఆపండి

Published Sat, Aug 24 2013 5:41 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

పౌరసత్వం కేసులో తీర్పు అమలు ఆపండి - Sakshi

పౌరసత్వం కేసులో తీర్పు అమలు ఆపండి

ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టులో పిటిషన్
 సాక్షి, హైదరాబాద్: భారతీయ పౌరసత్వం లేని కారణంగా ఎమ్మెల్యేగా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు వీలుగా తనకు నెల రోజులు గడువు ఇవ్వాలని కోర్టుకు ఆ పిటిషన్‌లో విన్నవించారు. తన వాదన వినకుండానే ఈ తీర్పు వెలువరించారని, దాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తన కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం జర్మనీలో చికిత్స పొందుతున్నానని పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement