
బడ్జెట్‌పై కాకి లెక్కలుబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
ఖమ్మం: అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను కాకి లెక్కల బడ్జెట్‌గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అభివర్ణించారు. ఖమ్మంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ప్రభుత్వం వచ్చాక గత డిసెంబర్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో ఎంత ఖర్చు చేశారు..? వేటికి ఎంత వెచ్చించారనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయలేకపోయిందని కిషన్‌రెడ్డి అన్నారు. కేవలం ప్రజలను ఏ విధంగా ఆకట్టుకోవాలన్న ఒకే ఒక్క ఎజెండాకు పరిమితమై రంగుల సినిమా చూపించేందుకు తాపత్రయ పడుతోందన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా అంచనాలను పెంచి బడ్జెట్ పెంచడం వల్ల కలిగే ప్రయోజనమేంటో తెలంగాణ సర్కార్‌కే తెలియాలని కిషన్‌రెడ్డి అన్నారు.