మైనారిటీలకు మేలు చేసినవాళ్లను ఎప్పటికీ మర్చిపోలేమని తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.
మైనారిటీలకు మేలు చేసినవాళ్లను ఎప్పటికీ మర్చిపోలేమని తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇప్పటివరకు మైనారిటీలకు మేలు చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్లు వచ్చాయని, వైఎస్ఆర్ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ల వల్ల మైనారిటీలకు ఎనలేని మేలు జరిగిందని ఆయన చెప్పారు. తాము కేసీఆర్ నుంచి మళ్లీ వైఎస్ఆర్ తరహా పాలనను కోరుకుంటున్నట్లు ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో చెప్పారు.