సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నడుస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని, సభ్యులు గొడవ చేస్తున్నా.. సభను నడపటం సరికాదని ఆయన అన్నారు. సభ్యులు ఆందోళన చేస్తూ.. గందరగోళం సృష్టిస్తున్న పట్టించుకోవడం లేదని, సభ ఆర్డర్‌లేని సమయంలో సభను వాయిదా వేయాలని, కానీ చూస్తూ ఊరుకోవడం సరికాదని ఆయన అన్నారు. ఇలాటి సభలో తాము ఉండమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని స్పీకర్ కాపాడాలని ఆయన కోరారు. బీజేపీని చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని అక్బరుద్దీన్ ప్రశ్నించారు.
మరోవైపు రైతుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. మద్దతు ధర అడిగితే చేతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మండిపడ్డారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్ స్పందిస్తూ పత్తిరైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. మద్దతు ధర కల్పించేందుకు రైతు సమన్వయ సమితులు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. గతంలో కంటే ఈసారి కచ్చితంగా పత్తికి మంచి ధర వస్తుందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment