అసెంబ్లీలో కమ్యూనిస్టు పార్టీల సభ్యులు ‘వెనుక’బడిపోయారు.
హైదరాబాద్: అసెంబ్లీలో కమ్యూనిస్టు పార్టీల సభ్యులు ‘వెనుక’బడిపోయారు. సీపీఐ, సీపీఎంల నుంచి ఒక్కరేసి చొప్పున ఉన్న తమను ‘ముందుకు’తీసుకురావాలని స్పీకర్‌కు మొరపెట్టుకున్నారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశ హాలు లో తాజాగా మార్పుచేర్పులు చేశారు. కుర్చీల సర్దుబాటుతో సభ్యుల స్థానాలు మారిపోయాయి. సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య, సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్‌ల స్థానాలు వెనుకకు చేరాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన వారిద్దరూ సోమవారం నిండు సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఏక సభ్య ప్రాతినిథ్యంగా ఉన్నందున, తమ స్థానాలను ముందుకు మార్చాలని వారు కోరారు.