
'బడ్జెట్ అంటే చిట్టాపద్దుల పట్టిక కాదు'
బడ్జెట్ అంటే చిట్టాపద్దుల పట్టిక కాదని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.
హైదరాబాద్: బడ్జెట్ అంటే చిట్టాపద్దుల పట్టిక కాదని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పూర్తి అవగాహన, స్పృహతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆశలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని ఆయన భరోసాయిచ్చారు. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం సమగ్ర దృక్పధం, దార్శినికతకు అనుగుణంగా బడ్జెట్ తయారు చేసినట్టు తెలిపారు.