మధ్యమానేరుకు మంచిరోజులు | ts-budget-2015 | Sakshi
Sakshi News home page

మధ్యమానేరుకు మంచిరోజులు

Published Fri, Mar 13 2015 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM

ts-budget-2015

మధ్యమానేరుకు మంచిరోజులొచ్చారుు. నిర్మాణం మొదలై ఎనిమిదేళ్లు దాటినా కట్ట దశలోనే ఉన్న ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలిపూర్తిస్థారుు బడ్జెట్‌లో నిధుల వరద పారించింది. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయూలని లక్ష్యంగా నిర్ణరుుంచిన ప్రభుత్వం ఆ మేరకు నిధులు కేటారుుంచింది. పనుల్లో వేగం పెంచడంతోపాటు పునరావాసాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు సిద్ధం చేస్తున్నారు.
 
 బోయినపల్లి : తెలంగాణ ప్రభుత్వం మధ్యమానేరు ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయూలని నిర్ణరుుంచింది. 2016 ఖరీఫ్ సీజన్‌నాటికి మిడ్‌మానేరులో మూడు టీఎంసీల నీరు నిల్వ చేస్తామని మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ గత నెల 23న ముస్తాబాద్‌లో జరిగిన రైతు బహిరంగ సభలో ప్రకటించారు. నిర్వాసితులకు త్వరితగతిన పరిహారం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు తగిన రీతిలో బడ్జెట్‌లో వరదకాలువ కోసం రూ.747 కోట్లు కేటారుుంచింది. వరదకాలువలో భాగమైన మధ్యమానేరు పనులు ఇక వేగవంతం కానున్నారుు. బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసిన వైనంపై ముంపుగ్రామాల ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నారుు.
 
 కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని 2,00,146 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని లక్ష్యంగా బోరుునపల్లి మండలం మాన్వాడ వద్ద 25.873 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతోఈ ప్రాజెక్టుకు   రూపకల్పన చేశారు. ఎస్సారెస్పీ వరదకాలువలో భాగంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు రూ.339.39 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 2006లో ప్రారంభించిన పనులు తొమ్మిదేళ్లుగా కొనసా...గుతూనే ఉన్నారుు. పనులు పొందిన సంస్థ తాము కొనసాగించలేమని చేతులెత్తేయడంతో 2010లో ప్రభుత్వం రూ.454 కోట్ల అంచనాలతో మరోసారి టెండర్లు పిలిచింది. 20 శాతం లెస్‌తో రూ.360.90 కోట్లకు ఎంఎస్.ఎస్‌ఏపీఎల్ అండ్ ఎంబీల్, ఐవీఆర్సీఎల్ అనే సంస్థలు జారుుంట్ వెంచర్‌గా ఏర్పడి పనులు దక్కించుకున్నారుు. ప్రాజెక్టు పనులు 2015 ఏప్రిల్ నాటికి పూర్తిచేస్తామని సదరు సంస్థలు చెప్పారుు. గడువు మరో నెలరోజులు మాత్రమే ఉండగా పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు ఇంకా పూర్తిస్థారుులో పరిహారం అందించకపోగా, స్పిల్‌వే, కట్ట పనులు కూడా నిలిచిపోయూరుు.
 
 తమకు పరిహారం అందించి, పునరావాస కాలనీల్లో వసతులు కల్పించాలని పలుమార్లు నిర్వాసితులు ఆందోళనకు సైతం దిగారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను సైతం పలుమార్లు కలిసి విన్నవించారు. త్వరలోనే పునరావాసకాలనీల్లో వసతులు కల్పిస్తామని, త్వరలోనే పరిహారం అందిస్తామని వారు సైతం ప్రకటించారు. పనుల్లో వేగం పెంచాలని నిర్ణరుుంచిన ప్రభుత్వం 2016 ఖరీఫ్ సీజన్‌కల్లా రైతులకు సాగునీరందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటారుుంచింది.
 
 చకచకా కట్ట పనులు
 ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా మాన్వాడ వాగు లో స్పిల్‌వే పనులు నిర్వహిస్తున్నారు. 25 గేట్లు, తూములు, క్రాస్ రెగ్యులేటర్లు నిర్మించాల్సి ఉంది. తొమ్మిదేళ్ల తర్వాత మట్టి కట్ట పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. 10 కిలోమీటర్ల మేర రిజర్వాయర్ మట్టికట్ట పనులు చేసేందుకు ఈ నెల 4న ఇంజినీరింగ్ అధికారులు కట్టపనులు ప్రారంభించారు. పనులు చకచకా చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
 
 ప్యాకేజీలపై కొత్త ఆశలు
 ప్రాజెక్టుకోసం రైతుల నుంచి వేలాది ఎకరాల భూములు సేకరించారు. బోరుునపల్లి మండల గ్రామాల రైతులనుంచే ఎనిమిది వేల ఎకరాాలకు పైగా భూమి సేకరించింది. బడ్జెట్‌లో పెద్దమొత్తంలో నిధులు కేటారుుంచడంతో నిర్వాసితులు తమకు రావాల్సిన ప్యాకేజీలపై ఆశలు పెంచుకుంటున్నారు. మాన్వాడలో 605 కుటుంబాల ప్యాకేజీ కోసం గత అక్టోబర్‌లో గెజిట్ పబ్లికేషన్ చేశారు.
 
 దీనిపై ఈ నెల 7న గ్రామంలో తహశీల్దార్ విచారణ జరిపారు. కొదురుపాక, నీలోజిపల్లి గ్రామాల్లో 2,306 కుటుంబాలను గెజిట్‌లో ప్రచురించారు. ఇందులో 1,560 కుటుంబాలకు రూ. 8.53 కోట్లు చెల్లించారు. ఇంకా 746 కుటుంబాలకు పరిహారం అందాల్సి ఉంది. వరదవెల్లిలో 887 కుటుంబాలు, మాన్వాడలో 584 కుటుంబాలు గెజిట్ కాగా ఇప్పటివరకు రెండు గ్రామాల్లో ఒక్క కుటుంబానికీ పరిహారం అందలేదు. శాభాష్‌పల్లిలో 315 కుటుంబాలు గెజిట్ కాగా, 283 కుటుంబాలకు రూ.3.42 కోట్లు పరిహారం చెల్లించారు. ఇంకా 32 కుటుంబాలకు పరిహారం రావాల్సి ఉంది. వేములవాడ మండలం సంకెపెల్లిలో 617, ఆరెపల్లిలో 26, రుద్రవరంలో 297, అనుపురంలో 1,088, కొడుముంజలో 462 కుటుంబాలకు పరిహారం రావాల్సి ఉంది. సిరిసిల్ల మండలం చీర్లవంచలో 344, చింతల్‌ఠానాలో 1,209 కుటుంబాలకు, ఇల్లంతకుంట మండలం గుర్రంవానిపల్లిలో 210 కుటుంబాలు గెజిట్‌కాగా మొత్తం 210 కుటుంబాలకు రూ.2.39 కోట్లు పరిహారం చెల్లించారు. 18 సంవత్సరాలు నిండిన నిర్వాసితులు ఇళ్లు, కుటుంబాల ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా అర్ములకు ఇళ్లు, అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వాల్సి ఉంది.
 
 పనులు వేగవంతం
 నిర్వాసితులు నివసించడానికి ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొదురుపాక, నీలోజిపల్లి గ్రామాలకు రూ.50 లక్షలతో రక్షిత నీటి ట్యాంకు, పైపులైన్ల నిర్మాణం చేస్తున్నారు. విద్యుత్ సౌకర్యం కోసం ట్రాన్స్‌ఫార్మర్లు బిగిస్తున్నారు. గతంలో పునరావాస కాలనీలు ముళ్లపొదలతో నిండిపోగా ప్రస్తుతం జంగల్‌కటింగ్‌తో కాలనీల్లో పిచ్చిచెట్లు, ముళ్ల పొదలు తొలగిస్తున్నారు.
 
 నిర్వాసితులకు మంచి రోజులు
 మిడ్‌మానేర్ రిజర్వాయర్ నిర్మాణం పనులు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు యుద్ధప్రాతిపదికన చేసేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దమొత్తంలో నిధులు కేటాయించడం శుభపరిణామం. సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారనడానికి బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం.
 - జోగినిపల్లి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ర్ట నాయకులు
 
 సమస్యలు పరిష్కరించాలి
 బడ్జెట్‌లో పెద్దమొత్తంలో నిధులు కేటాయించినందున అధికారులు యుద్ధప్రాతిపదికన మిడ్‌మానేర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి. కుటుంబ పరిహారం, ఇళ్ల పరిహారం సత్వరమే చెల్లించాలి. పునరావాస కాలనీల్లో అన్ని వసతులు కల్పించాలి. 18 ఏళ్లు దాటినవారికి కుటుంబ ప్యాకేజీ ఇవ్వాలి.
 - రామిడి శ్రీనివాస్, మాన్వాడ సర్పంచ్
 
 ఎదురుసూత్తన్నం
 ప్రాజెక్టు ఎప్పుడో అరుుపోతదన్నరు. మా ఊళ్లె భూములన్నీ తీసుకున్నరు. ఇండ్లను కూడా లెక్కలు చేసిండ్రు. కొందరికేమో పైసలిచ్చిండ్రు. ఇంకొందరికి ఇయ్యనే లేదు. ఇండ్లజాగలు కేటారుుంచలేదు. ప్రభుత్వం ఇప్పుడు పైసలు బాగా ఇచ్చిందట. ఇప్పుడన్నా మా పైసలు తొందరగా ఇస్తరని ఎదురుసూత్తన్నం.            
 - పోశవ్వ, నిర్వాసితురాలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement