శాసనసభలో తమ పార్టీ సభ్యులు లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం ఆందోళనకి దిగారు.
హైదరాబాద్: శాసనసభలో తమ పార్టీ సభ్యులు లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం ఆందోళనకి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్కారు తీరును ఖండిస్తూ ఛలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని తలపెట్టారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైటాయించి కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.