సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ముచ్చింతల్‌లోని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ ఉదయం ఆశ్రమంలో సీతారామ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీయాగంలో యడియూరప్ప పాల్గొంటారు. ఈ సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా చినజీయర్ ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు.
కాగా నిన్నశంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చిన యడియూరప్పకు వేద పండితులు ఆశీర్వచనాలతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన చినజీయర్ స్వామిని కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఆయన రాత్రి ఆశ్రమంలోనే బస చేశారు.
Comments
Please login to add a commentAdd a comment