
మీడియాతో మాట్లాడుతున్న బసనగౌడ
బెంగళూరు : భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ బతికి బట్టకట్టాలంటే ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ వచ్చే ఎన్నికలకు బీజేపీకి ఇలాంటి సీఎం అక్కర్లేదు. కర్ణాటకలో బీజేపీ బతికుండాలంటే సీఎంను మార్చాల్సిన అవసరం ఉంది. సీఎంను కచ్చితంగా మార్చాలి’’ అని అన్నారు.
కాగా, కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేయటం తరచుగా జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం బీజేపీ సీనియర్ లీడర్ ఒకరు యడియూరప్పపై కామెంట్లు చేశారు. యడియూరప్ప పంచమశాలి లింగాయత్‌లను తన రాజకీయ స్వలాభం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment