సాక్షి, బెంగళూరు: భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసరాల ధరలు, వీటికి తోడు రమేశ్ జార్కిహొళి శృంగార బాగోతం మధ్య సీఎం యడియూరప్పకు అగ్నిపరీక్ష ఎదురుకాబోతోంది. గురువారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు జార్కిహొళి సీడీ వివాదంపై ప్రతిపక్షాలు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే అవకాశం ఉంది. ఏడాదిన్నర కిందట కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంలో కీలకపాత్ర పోషించిన రమేశ్ జార్కిహొళి అంశంపై ఎక్కువ చర్చలు జరిగే అవకాశముందని అంచనా. అలాగే ఇటీవల సంభవించిన శివమొగ్గ, చిక్కబళ్లాపుర పేలుళ్లపై కూడా ప్రశ్నించనున్నాయి. ఉభయ సభలూ చర్చకు బదులు రచ్చలతో దద్దరిల్లినా ఆశ్చర్యం లేదని అంచనాలు నెలకొన్నాయి.
8వ తేదీన బడ్జెట్ సమర్పణ..
నేడు మొదలయ్యే బడ్జెట్ సమావేశాలు సుమారు 19 రోజుల (మార్చి 31 వరకు) పాటు జరుగుతాయి. మొదటి రెండురోజులు ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘ఒకే దేశం– ఒకే ఎన్నికలు’ అంశంపై చర్చిస్తారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తున్న తొలి రాష్ట్రం కర్ణాటక కావడం గమనార్హం. ఇక 8వ తేదీన సోమవారం సీఎం యడియూరప్ప రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఈ సమావేశాల్లో కర్ణాటక పౌరసభ బిల్లు–2021, సొసైటీల రిజిస్ట్రేషన్ బిల్లు వంటి బిల్లులపై చర్చ జరగనుంది. సందర్శకులకు అనుమతిస్తారు. గ్యాలరీలో భౌతిక దూరం పాటిస్తూ ప్రజలు, విద్యార్థులు సమావేశాలను వీక్షింవచ్చు.
చదవండి:
కన్నడ నేతల రాసలీలలు.. ప్రతిసారీ రాజీనామాలు
చిన్నమ్మ సంచలన నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment