సాక్షి, చిత్తూరు : కర్ణాటక సత్రాల నూతన సముదాయ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొన్నారు. దాదాపు 200కోట్ల రూపాయలతో ఓ అధునాతన కర్ణాటక సత్రం రూపుదిద్దుకోనుంది. 7 ఎకరాల్లో ఐదు కాంప్లెక్స్‌లు, రోజుకు 1800 మంది భక్తులకు వసతి కల్పించేలా వాటి నిర్మాణం జరగనుంది. కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన నిధులతో టీటీడీ ఈ భవనాలను నిర్మించనుంది. (సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రులు)
కాగా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కరోనా నేపథ్యంలో లోక కళ్యాణార్ధం టీటీడీ గత మార్చి నెలనుంచి నిర్వహిస్తోన్న ధన్వంతరి మహా యాగం, ధన్వంతరి యోగ వశిష్ట్యం, గీతా పారాయణం, సుందరకాండ పారాయణం కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనం కోసం కర్ణాటక నుంచి వచ్చే భక్తుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం సత్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి తిరుమలలో జరిగిన భవన నిర్మాణ పూజా కార్యక్రమంలో @AndhraPradeshCM @ysjagan గారు మరియు @CMofKarnataka @BSYBJP గారు పాల్గొన్నారు. pic.twitter.com/DIG4fmiPZu
— Y V Subba Reddy (@yvsubbareddymp) September 24, 2020
Comments
Please login to add a commentAdd a comment