
బెంగళూరు, తుమకూరు: ‘ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తూ ఊరుకోవడానికి మేమేమి సన్నాసులం కాదు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. ఆదివారం పట్టణ శివార్లలోని మంచల్‌కుప్పలో బాగూరు సొ రంగ కాలువ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వ ఎమ్మెల్యేల రాజీనామాలపై విధానసభ స్పీకర్ నిర్ణయం తీసుకున్న తరువాత అధిష్టానంతో చర్చించి తదు పరి కార్యాచరణకు శ్రీకారం చుడతామన్నారు. కాంగ్రెస్– జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో బీజేపీకి సంబంధం లేదని చెప్పారు. 13 మంది ఎమ్మెల్యేలురాజీనామ చేసిన అనంతరం సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని, ఈ తరుణంలో అధికారం చేజి క్కించుకోకుండా దూరంగా ఉండడానికి మేమేమి సన్నాసులం కాదని స్పష్టంచేశారు.ఎట్టిపరిస్థితుల్లోనూ మధ్యంతర ఎన్నికలకు అవకాశమివ్వబోమని, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
హేమావతి నీరు రాకుండా కుట్ర
హేమావతి కాలువలో రాతిబండలు అడ్డమేసి తుమకూరుకు నీళ్లు రాకుండా కుట్ర చేశారంటూ యడ్డి ఆరోపించారు. కాలువలో రాళ్లను అడ్డంగా వేసి తుమకూరుకు రావాల్సిన 25 టీఎంసీల నీటి లో ఒక్క చుక్కనీరు కూడా రాకుండా అడ్డుపడిందెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. సిద్దగం గ మఠంలో శివకుమార స్వామీజీ సమా ధిని యడ్డి దర్శించుకున్నారు.కార్యక్రమం లో ఎంపీ బసవరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment