రాజీకి రాకపోతే.. పార్టీ నుంచి వెళ్లిపోండి! | Amit Shah to warring Karnataka leaders | Sakshi
Sakshi News home page

రాజీకి రాకపోతే.. పార్టీ నుంచి వెళ్లిపోండి!

Published Sat, Jan 28 2017 10:45 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

రాజీకి రాకపోతే.. పార్టీ నుంచి వెళ్లిపోండి! - Sakshi

రాజీకి రాకపోతే.. పార్టీ నుంచి వెళ్లిపోండి!

కర్ణాటక నేతలకు అమిత్‌ షా సీరియస్‌ వార్నింగ్‌!

బెంగళూరు: పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా గట్టిగా మందలించడంతో కర్ణాటక బీజేపీ అగ్ర నేతలు బీఎస్‌ యడ్యూరప్ప, కేఎస్‌ ఈశ్వరప్ప విభేదాలు పక్కనబెట్టి రాజీకి అంగీకరించారు. కన్నడ పోరాటయోధుడు సంగోలి రాయన్న సంస్మరణార్థం నిర్వహించనున్న కార్యక్రమాలు పార్టీ వేదికలో ఉమ్మడిగా నిర్వహించేందుకు అంగీకరించారు. సంగోలి రాయన్న సంస్మరణ కార్యక్రమాలు సంగోలీ రాయన్న బ్రిగేడ్‌ పేరిట పార్టీకి అతీతంగా కర్ణాటక శాసనమండలి ప్రతిపక్ష నేత కేఎస్‌ ఈశ్వరప్ప ప్రత్యేకంగా నిర్వహించేందుకు సిద్ధపడటంతో పార్టీలో ముసలం తలెత్తింది. ఈ కార్యక్రమాలను రాష్ట్ర బీజేపీ చీఫ్‌ యడ్యూరప్ప వ్యతిరేకించారు. దీంతో ఇరువురు నేతల మధ్య ప్రచ్ఛన్నయుద్ధానికి తెరలేచింది.

దీంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు షా రంగంలోకి దిగి ఇరువురు నేతలకు గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. పార్టీ సంప్రదాయాలకు అనుగుణంగా పనిచేయకుంటే.. పార్టీని వీడి వెళ్లిపోవచ్చునంటూ ఇరువురు నేతలకు ఆయన ఘాటుగా చెప్పడంతో ఇద్దరు దిగొచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో యడ్యూరప్ప, ఈశ్వరప్ప ఇద్దరూ పాల్గొంటారని బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలిపారు. పార్టీలో ఇరువురు అగ్రనేతల మధ్య విభేదాలతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు గందరగోళం నెలకొందని కర్ణాటకకు చెందిన కేంద్రమంత్రులు అధిష్టానానికి నివేదించడంతో షా కల్పించుకొని ఈమేరకు ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదిర్చినట్టు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement