
బెంగళూరు: కరోనా వల్ల కొందరు కేంద్ర మంత్రులు, ఎంపీలు మరణించారు.. అంతమాత్రాన లోక్‌సభను మూసివేయాలంటారా? అంటూ కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెఏస్.ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్‌లో మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖతో సమావేశమయ్యారు. ఈ సందర్భంంగా ఆయన మాట్లాడూతూ... రైతులు కూడా కోవిడ్ వల్ల చనిపోయారు.. అలా అయితే వ్యవసాయం బంద్ చేయాలా?’ అని వ్యాఖ్యానించారు. కరోనా వచ్చినంత మాత్రాన అన్నింటినీ నిలిపివేయడం సాధ్యం కాదన్నారు. కాబట్టి తాము అమలు చేయబోయే పథకాలను కూడా నిలిపివేయలేమని చెప్పారు. అనంతరం అన్నివర్గాలతో చర్చించి పాఠశాలల పునః ప్రారంభంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment