Eshwarappa
-
Karnataka: ఈశ్వరప్ప కుమారుడికి మొండిచేయి
బెంగళూరు: రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠకు గురిచేసిన శివమొగ్గ నగర నియోజకవర్గం టికెట్‌ను ఎట్టకేలకు బీజేపీ అధిష్టానం చన్నబసప్ప (చెన్ని)కు కేటాయించింది. వయసు రీత్యా రాజకీయాల నుంచి తప్పుకుని తన కుమారుడికి టికెట్ ఇప్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేసిన మాజీ మంత్రి ఈశ్వరప్పకు తీవ్ర నిరాశ మిగిలింది. కుటుంబ రాజకీయలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ ఆయన విన్నపాన్ని ఖాతరు చేయలేదు. పైగా పలు ఆరోపణలు కూడా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో కొత్త వ్యక్తి, మహానగర పాలికె కార్పొరేటర్ చెన్నబసప్పకే టికెట్ కేటాయించారు. సిద్దు ఆస్తులు రూ.50 కోట్లు.. రూ. 23 కోట్ల అప్పులు మైసూరు: వరుణ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సీఎం అయిన సిద్దరామయ్య ఆస్తి గడిచిన ఐదు సంవత్సరాలో రెండున్నర రెట్లు పెరిగింది. ప్రస్తుతం సిద్దరామయ్య మొత్తం ఆస్తి రూ.50.77 కోట్లుగా ఉంది. ఇందులో రూ. 21.35 కోట్లు చరాస్తులు, రూ. 29.4 కోట్లు స్థిరాస్తులు. అప్పులు రూ.23.7 కోట్లుగా తెలిపారు. 2013 ఎన్నికల్లో ఆయన ఆస్తి రూ.13.61 కోట్లు, 2018 ఎన్నికల్లో రూ. 20.36 కోట్లుగా ఉండేది. తాజాగా ఆయన అప్పులు కూడా భారీగా ఉన్నాయి. ఆయనకు రూ. 6.14 కోట్ల అప్పు, సతీమణికి రూ.16.24 కోట్ల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. చదవండి: నామినేషన్ల ఘట్టం సమాప్తం.. ఇక ప్రచార హోరు! -
మంత్రి ఈశ్వరప్ప కేసులో ట్విస్టులు.. ఎఫ్ఐఆర్పై మరో వివాదం
సాక్షి, బెంగళూరు: కర్నాకటలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య పెను దుమారం రేపుతోంది. ఈ కేసు విషయంలో ఇప్పటికే మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆత్మహత్య వివాదం మాత్రం ఇంకా ముగిసిపోలేదు. కాంట్రాక్టర్ ఆత్మహత్య విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ కేసులో మంత్రి ఈశ్వరప్ప రాజీనామా పరిష్కారం కాదన్నారు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ అనుమానాస్పద మృతి కేసులో ఈశ్వరప్పపై కేసు నమోదు చేసి.. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్‌ను ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ అడిగినట్లు ఎఫ్ఐఆర్లో ఎక్కడుందని ప్రశ్నించారు. అవినీతి నిరోధక చట్టం కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశ్వరప్పపై కేసు నమోదు చేయాలన్నది కర్ణాటక ప్రజల డిమాండ్ అని శివకుమార్ అన్నారు. ఈశ్వరప్ప, అతని స్నేహితులు రమేశ్, బసవరాజ్‌ను కూడా అరెస్టు చేయాలని శివకుమార్ కోరారు. విచారణ ప్రారంభించకముందే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. -
కాంట్రాక్టర్ మృతి కేసు.. మంత్రి ఈశ్వరప్ప రాజీనామా!
కాంట్రాక్టర్ ఆత్మహత్యతో వివాదంలో చిక్కుకున్న కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప ఎట్టకేలకు రాజీనామాకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ధృవీకరించిన ఈశ్వరప్ప.. గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశాడు. తనుకు మద్ధతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక రాజీనామా లేఖను ఈశ్వరప్ప శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి బసవరావ్ బొమ్మైకి సమర్పించనున్నట్లు తెలిపారు. ఈశ్వరప్ప దిగిపోవాలంటూ విపక్షాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈశ్వరప్ప దిగిపోవాల్సిందేనని సీఎం బొమ్మై ఆదేశించినట్లు తెలుస్తోంది. Karnataka Minister KS Eshwarappa, whose name appeared in alleged suicide case of contractor Santosh Patil, says that he will handover his resignation to the Chief Minister tomorrow. Says, "Tomorrow I'm handing over the resignation letter to CM. I thank you all for co-operation." pic.twitter.com/vZFVrP4diI — ANI (@ANI) April 14, 2022 బెళగావి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్, బీజేపీ నేత సంతోష్ పాటిల్.. తన చావుకు మంత్రి ఈశ్వరప్ప కారణమని లేఖ రాసి ఉడిపిలోని ఓ లాడ్జీలో సోమవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగు కోట్ల రూపాయల రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి పేమెంట్ క్లియర్ చేయడానికి.. 40 శాతం కమీషన్ కోసం తన పీఏ ద్వారా మంత్రి ఈశ్వరప్ప వేధించాడంటూ సదరు కాంట్రాక్టర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంతోష్ పాటిల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో మంత్రి ఈశ్వరప్పతోపాటు ఆయన మద్దతుదారులు బసవరాజ్, రమేశ్ పేర్లను కూడా చేర్చారు. ఈశ్వరప్పను మంత్రి వర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ భారీ ఆందోళనకు దిగింది. ఈశ్వరప్ప, ఆయన సన్నిహితులపై ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో మంత్రికి సీఎం బసవరాజు బొమ్మై సమన్లు జారీ చేశారు. అయితే దర్యాప్తు పూర్తయ్యేదాకా ఆయనపై చర్యలు ఉండబోవని సీఎం బొమ్మై చెప్పారు. ఈ లోపు కాంగ్రెస్ ఆందోళనలు ఉదృతం అయ్యాయి. ఇక.. తాను మంత్రి పదవికి రాజీనామా చేయబోనని ఈశ్వరప్ప ఇదివరకే ఓ ప్రకటన చేశాడు కూడా. -
సూసైడ్ కలకలం: మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు.. రంగంలోకి సీఎం
సాక్షి, బెంగళూరు: మంత్రి ఈశ్వరప్పకు కమీషన్లు ఇచ్చుకోలేనని సంతోష్‌పాటిల్ అనే బెళగావి జిల్లా కాంట్రాక్టర్ మంగళవారం ఉడుపిలోని ఒక లాడ్జిలో ఆత్మహత్య చేసుకోవడం కర్నాటకలో కలకలం రేపుతోంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ – గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్పే తన ఆత్మహత్యకు కారణమని కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ డెత్ నోట్ రాసిపెట్టి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో మంత్రి పదవి నుంచి ఈశ్వరప్పను తప్పించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంతోష్ పాటిల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో మంత్రి ఈశ్వరప్పతో పాటు ఆయన మద్దతుదారులు బసవరాజ్, రమేశ్ పేర్లను కూడా చేర్చారు. అయితే ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయాలని పోలీసులను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశించారు. కాషాయ జెండా వివాదం.. బీజేపీలో ఎంతో సీనియర్ అయిన కేఎస్ ఈశ్వరప్పకు మాజీ సీఎం యడియూరప్పతో అసలు పొసగదు. అనేక మంది పార్టీ నేతలతోనూ అంతంతమాత్రమే సంబంధాలున్నాయి. ఎర్రకోటపై కాషాయ జెండా ఎగురుగుతుందని ఈశ్వరప్ప ఇటీవల చేసిన వ్యాఖ్యల వల్ల అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్‌పార్టీ వారంరోజుల పాటు అడ్డుకుంది. యడియూరప్ప, బొమ్మై మంతనాలు బెళగావి పర్యటనలో ఉన్న బీఎస్ యడియూరప్పతో మంగళవారం రాత్రి సీఎం బసవరాజ్ బొమ్మై భేటీ అయ్యారు. ఈశ్వరప్ప విషయమై చర్చించినట్లు తెలిసింది. నేడో – రేపో ఈశ్వరప్ప నుంచి రాజీనామా కోరవచ్చని సమాచారం. ఇదో చేతకాని సర్కార్: సుర్జేవాలా ఇది చేతకాని ప్రభుత్వమని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్‌సింగ్ సుర్జేవాలా అన్నారు. మంగళవారం ఆయన బెంగళూరులో మాట్లాడుతూ ఓ కాంట్రాక్టరును మంత్రి 40 శాతం కమీషన్ అడిగారని ఆత్మహత్య చేసుకోవడం దారుణం, ఆ మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అన్నారు. బుధవారం కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. ఇది చదవండి: మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అసదుద్దీన్ సవాల్ -
KS Eshwarappa Issue: అనని మాటలకు రాద్ధాంతం చేస్తున్నారు
Karnataka Assembly showdown: బీజేపీ నేత అత్సుత్సాహ ప్రకటన.. కర్ణాటక నాట రాజకీయ చిచ్చును రగిల్చింది. జాతీయ జెండా స్థానంలో ఏదో ఒకరోజు కాషాయపు జెండా ఎర్రకోటపై ఎగిరి తీరుతుందని బీజేపీ నేత, ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే.ఎస్.ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు ఊహించని పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలో.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ప్రతిపక్ష కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అసలు ఈశ్వరప్ప అలాంటి వ్యాఖ్యలే చేయలేదని వెనకేసుకొచ్చారు కర్ణాటక సీఎం. ‘ఈశ్వరప్ప.. ఎర్రకోట జెండాపైనా కాషాయపు జెండా ఎగురుతుందని ఏనాడూ అనలేదు. అదంతా అబద్ధం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన అర్థం పర్థం.. ఓ విలువంటూ లేనిది. కేవలం ఇగో, రాజకీయాల కోసం వాళ్లు అలా చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ చరిత్రలోనే ఇలాంటి పరిణామాలెన్నడూ జరగలేదు. ఇది కనీసం ప్రజా సమస్య కూడా కాదు. గతంలో ప్రజల కోసం రాజకీయ పోరాటాలు సాగేవి. ఇప్పుడు వీళ్లు చేస్తోంది అర్థం పర్థం లేనిది. ప్రతిపక్షాలు వాళ్లు ఏం చేయాలో మరిచిపోయినట్లు ఉన్నారు’’ అంటూ సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈశ్వరప్ప తప్పుకోవాల్సిందే! సీఎం బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యలకు కర్ణాటక కాంగ్ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. ‘కాషాయపు జెండా వ్యాఖ్యలపై ఈశ్వరప్ప రాజీమానా చేయాల్సిందే. ఆయన్ని తొలగించేంత వరకు రాత్రింబవలు మా నిరసన కొనసాగుతూనే ఉంటాయి. అయినా పట్టించుకోకపోతే.. కోర్టుకు వెళ్తాం. అసెంబ్లీని స్తంభింపజేస్తాం. జాతీయ జెండాను అవమానపర్చడమే బీజేపీ ఒక ఎజెండాగా పెట్టుకుంది. రాజ్యాంగం గురించి.. జాతీయ జెండా గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్లు ఆ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ జెండాను, స్వాతంత్ర్యాన్ని దేశానికి అందించింది. వాళ్లేమో(బీజేపీ) ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు’ అంటూ శివకుమార్ స్పందించారు. Karnataka Minister KS Eshwarappa must resign (over his saffron flag remark). We'll continue overnight protests at Karnataka Assembly till he gets sacked from the Cabinet, otherwise, we'll go to the court & not allow the Assembly to function: Karnataka Congress chief DK Shivakumar pic.twitter.com/IhvLaT9g6g — ANI (@ANI) February 18, 2022 ఇదిలా ఉంటే.. జాతీయ జెండాను అవమానించేలా మాట్లాడిన ఈశ్వరప్ప.. దేశద్రోహం నేరానికి పాల్పడ్డారని, ఆయన్ని తక్షణమే కేబినెట్ నుంచి తప్పించి, దేశద్రోహం కేసు నమోదు చేయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కాంగ్ ఎమ్మెల్యేలు విధానసభలో ధర్నా చేస్తున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు విఘాతం కలుగుతోంది. అంతేకాదు.. ఈశ్వరప్పకు వ్యతిరేకంగా రాత్రంతా విధానసభలోనే ధర్నా చేయాలని సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య ఎమ్మెల్యేలకు సూచించడంతో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ వసతి, భోజన ఏర్పాట్లను సిద్ధం చేయగా.. ఎమ్మెల్యేలు రాత్రంతా అసెంబ్లీలో ఉంటున్నారు. మరోవైపు ఈశ్వరప్పకు వ్యతిరేకంగా విధానపరిషత్‌లోనూ గందరగోళం నెలకొనటంతో సమావేశం వాయిదాపడుతోంది. దీంతో రంగంలోకి దిగిన అసెంబ్లీ స్పీకర్, మాజీ సీఎం బి.ఎస్.యడ్యూరప్ప సహా పలువురు సీనియర్ నేతలు రంగంలోకి దిగి కాంగ్రెస్‌తో చర్చలు జరిపినా.. లాభం లేకుండా పోతోంది. నేను దేశభక్తుడిని..: ఈశ్వరప్ప నేనే తప్పు చేయలేదు. నేను దేశభక్తున్ని, నేనెందుకు రాజీనామా చేయాలి? అని మంత్రి కే.ఎస్.ఈశ్వరప్ప అంటున్నారు. గురువారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన.. జాతీయ జెండాకు అవమానం చేసింది కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ అని, ఆయనే రాజీనామా చేయాలన్నారు. ఎర్రకోటపై కాషాయ జెండాను రాబోయే 300–500 సంవత్సరాల్లో ఎగురవేయవచ్చని చెప్పాను అంతే. జాతీయ జెండాను అవమానించలేదు. నా మాటలకు కట్టుబడి ఉన్నా. కాంగ్రెస్ వారికి పని లేక అనవసరంగా వివాదాలు సృష్టించే పని చేస్తున్నారు అని పేర్కొన్నారు. మరోవైపు ఈశ్వరప్పకు వ్యతిరేకంగా పలుచోట్ల కాంగ్రెస్ నాయకులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. -
మంత్రి.. మర్కట ప్రేమ.. కొత్తబట్టలు తొడిగి.. కేక్ కట్ చేయించి
సాక్షి, శివమొగ్గ (కర్ణాటక): ఇళ్లల్లో పెంపుడు జంతువులకు పుట్టినరోజు, బారసాల, సీమంతాలు జరపడం నేటి రోజుల్లో ఒక ట్రెండ్‌గా మారింది. ఆ కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహించాలని యజమానులు కూడా తపిస్తుంటారు. ఇదే కోవలో ఒక కోతికి పుట్టినరోజు నిర్వహించగా, ఒక సీనియర్ మంత్రి హాజరై దానిని ఆశీర్వదించారు. ఈ తతంగం కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఎన్.టి.రోడ్డులో నివాసం ఉండే పార్వతమ్మ అనే మహిళ ఆరేళ్ల నుంచి ఒక వానరాన్ని పెంచుకుంటోంది. సోమవారం సాయంత్రం కోతి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప, మరో స్వామీజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కోతికి కొత్తబట్టలు తొడిగి, దానితోనే కేక్ కట్ చేయించి, తినిపించి ముచ్చట పడ్డారు. రాజకీయ వ్యూహాలతో సొంత, ప్రతిపక్ష పార్టీల నేతలను ముప్పతిప్పలు పెట్టే మంత్రి ఈశ్వరప్పలో ఇంత జంతు ప్రేమ ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అలరిస్తోంది. -
మాజీ మంత్రిని కలిసిన ప్రముఖ కన్నడ నటుడు
మైసూరు: మాజీ మంత్రి కేఎస్.ఈశ్వరప్పను హ్యాట్రిక్ హీరో శివ రాజ్‌కుమార్ కలిశారు. ఆషాఢ శుక్రవారం సందర్భంగా మైసూరు వచ్చిన ఈశ్వరప్ప అల్పాహారం కోసం ఓ హోటల్‌కు వెళ్లిన సమయంలో అక్కడే ఉన్న శివరాజ్ కుమార్ ఈశ్వరప్పను కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. -
కరోనాతో చనిపోతే లోక్‌సభను మూసేయాలా?
బెంగళూరు: కరోనా వల్ల కొందరు కేంద్ర మంత్రులు, ఎంపీలు మరణించారు.. అంతమాత్రాన లోక్‌సభను మూసివేయాలంటారా? అంటూ కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెఏస్.ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖతో సమావేశమయ్యారు. ఈ సందర్భంంగా ఆయన మాట్లాడూతూ... రైతులు కూడా కోవిడ్ వల్ల చనిపోయారు.. అలా అయితే వ్యవసాయం బంద్ చేయాలా?’ అని వ్యాఖ్యానించారు. కరోనా వచ్చినంత మాత్రాన అన్నింటినీ నిలిపివేయడం సాధ్యం కాదన్నారు. కాబట్టి తాము అమలు చేయబోయే పథకాలను కూడా నిలిపివేయలేమని చెప్పారు. అనంతరం అన్నివర్గాలతో చర్చించి పాఠశాలల పునః ప్రారంభంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. -
'ఈశ్వరప్ప ఎందుకలా చేస్తున్నారో'
బెంగళూరు : కర్ణాటక విపక్ష బీజేపీలో అసమ్మతి మరోసారి బహిర్గతమయ్యింది. ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప, సీనియర్ నేత ఈశ్వరప్ప మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇప్పటీకే యెడ్డీ వర్గీయులు ఈశ్వరప్పకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఆయన స్థాపించిన రాయణ్ణ బ్రిగేడ్ ముఖ్యమా, బీజేపీ ముఖ్యమా తేల్చుకోవాలని సూచనలు చేశారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ... ఈశ్వరప్ప సమస్యలు సృష్టిస్తున్నారని, ఆయన ఎందుకు అలా చేస్తోన్నారో అర్థం కావడం లేదన్నారు. ఒకవేళ పదవి విషయానికి సంబంధించిన వ్యవహారం అయితే తాము చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపారు. మరోవైపు నిన్నటివరకూ దూకుడుగా వ్యవహరించిన ఈశ్వరప్ప దూకుడు తగ్గింది. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్పే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఈశ్వరప్ప వ్యాఖ్యానించారు. కాగా ఈశ్వరప్ప ప్యాలెస్ మైదానంలో ప్రత్యేక సభను నిర్వహించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా యడ్యూరప్పకు అధికారం ఇవ్వాలంటూ పలువురు బీజేపీ నేతలు పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాను కోరారు. పార్టీ నాయకులు అనుసరిస్తున్న విధానాలు నచ్చకపోతే పార్టీ జాతీయ నాయకులకు ఫిర్యాదు చేయాలని అంతేకానీ వ్యక్తిగత లాభం కోసం పార్టీని కించపరచవద్దని సూచించారు. బీజేపీ పార్టీలో సీనియర్ నాయకుడైన ఈశ్వరప్ప విధానసభ ఎన్నికల్లో ఓటమి చెందినా విధాన పరిషత్‌లో పార్టీ పదవిని అప్పగించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈశ్వరప్ప ఇదే రీతిలో వ్యవహరిస్తే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు గానూ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈశ్వరప్ప కాస్త వెనక్కి తగ్గి యడ్యూరప్పతో సయోధ్యకు సిద్ధం కావడం విశేషం. -
రాజీకి రాకపోతే.. పార్టీ నుంచి వెళ్లిపోండి!
కర్ణాటక నేతలకు అమిత్ షా సీరియస్ వార్నింగ్! బెంగళూరు: పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గట్టిగా మందలించడంతో కర్ణాటక బీజేపీ అగ్ర నేతలు బీఎస్ యడ్యూరప్ప, కేఎస్ ఈశ్వరప్ప విభేదాలు పక్కనబెట్టి రాజీకి అంగీకరించారు. కన్నడ పోరాటయోధుడు సంగోలి రాయన్న సంస్మరణార్థం నిర్వహించనున్న కార్యక్రమాలు పార్టీ వేదికలో ఉమ్మడిగా నిర్వహించేందుకు అంగీకరించారు. సంగోలి రాయన్న సంస్మరణ కార్యక్రమాలు సంగోలీ రాయన్న బ్రిగేడ్ పేరిట పార్టీకి అతీతంగా కర్ణాటక శాసనమండలి ప్రతిపక్ష నేత కేఎస్ ఈశ్వరప్ప ప్రత్యేకంగా నిర్వహించేందుకు సిద్ధపడటంతో పార్టీలో ముసలం తలెత్తింది. ఈ కార్యక్రమాలను రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప వ్యతిరేకించారు. దీంతో ఇరువురు నేతల మధ్య ప్రచ్ఛన్నయుద్ధానికి తెరలేచింది. దీంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు షా రంగంలోకి దిగి ఇరువురు నేతలకు గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. పార్టీ సంప్రదాయాలకు అనుగుణంగా పనిచేయకుంటే.. పార్టీని వీడి వెళ్లిపోవచ్చునంటూ ఇరువురు నేతలకు ఆయన ఘాటుగా చెప్పడంతో ఇద్దరు దిగొచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో యడ్యూరప్ప, ఈశ్వరప్ప ఇద్దరూ పాల్గొంటారని బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలిపారు. పార్టీలో ఇరువురు అగ్రనేతల మధ్య విభేదాలతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు గందరగోళం నెలకొందని కర్ణాటకకు చెందిన కేంద్రమంత్రులు అధిష్టానానికి నివేదించడంతో షా కల్పించుకొని ఈమేరకు ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదిర్చినట్టు తెలుస్తోంది. -
‘బ్రిగేడ్ ఇకపై రాజకీయేతర శక్తి’
దావణగెరె : సంగొళ్లి రాయణ్ణ బ్రిగేడ్ ఇకపై రాజకీయేతర శక్తిగా ముందుకు సాగుతుందని విధాన పరిషత్ విపక్ష నేత, బ్రిగేడ్ స్థాపకుడు కేఎస్ ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఆయన బుధవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. వెనుకబడిన, దళిత మఠాధిపతుల సమాఖ్య గౌరవాధ్యక్షుడు పురుషోత్తమానందపురి స్వామీజీ, అధ్యక్షులైన నిరంజనానందపురి స్వామీజీ, మాదార చెన్నయ్య స్వామీజీలతో బ్రిగేడ్ కార్యకలాపాల గురించి చర్చించామని, ఆ సమయంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు, యడ్యూరప్పను సీఎంను చేసేందుకే బ్రిగేడ్‌ని స్థాపిస్తే తాము కొనసాగబోమని చెప్పారని, అందువల్ల వెనుకబడిన, దళిత సమాజాలకు సామాజిక న్యాయం కల్పిస్తే బ్రిగేడ్‌కు సహకారం అందిస్తామని చెప్పినందున సంగొళ్లి రాయణ్ణ బ్రిగేడ్‌ను ఇకపై రాజకీయేతరంగా ముందుకు నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. జీవితాంతం బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కరువు పీడిత తాలూకాల జాబితా ప్రకటిస్తే సరిపోదని, కరువును సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈసందర్భంగా మాజీ మంత్రి రవీంద్రనాథ్, డాక్టర్ శివయోగిస్వామి, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాల్లోకి రావడానికి బీఎస్‌వై, కేఎస్‌లే కారణం
కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సిద్దేశ్వర్ దావణగెరె : తన రాజకీయ రంగ ప్రవేశానికి బీజేపీ నేతలు బీఎస్ యడ్యూరప్ప, కేఎస్ ఈశ్వరప్పలు కారకులే తప్ప స్థానిక బీజేపీ నాయకులెవరూ కాదని మాజీ కేంద్ర మంత్రి, దావణగెరె లోక్‌సభ సభ్యుడు జీఎం సిద్దేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మాజీ మంత్రి ఎస్ఏ రవీంద్రనాథ్ తదితరులు తనను, తన తండ్రి మల్లికార్జునప్పను బీజేపీలోకి తీసుకువచ్చినట్లు చెబుతున్నారని, అయితే అది వాస్తవం కాదన్నారు. తనను బీజేపీలోకి ఆహ్వానించింది యడ్యూరప్ప, ఈశ్వరప్పలతో పాటు సంఘ్ పరివార్ కృష్ణమూర్తిలని స్పష్టం చేశారు. స్థానిక నాయకులెవరూ తనను బీజేపీలోకి పిలుచుకు రాలేదన్నారు. తాను గెలుపొందిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో తనకు బీ-ఫారం ఇవ్వరాదని జాతీయ నాయకులపై ఒత్తిడి తెచ్చేందుకు స్థానిక నాయకులు ఢిల్లీకి వెళ్లారని ఎద్దేవా చేశారు. తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినందుకు తనకు ఎలాంటి బాధ లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమించడం ద్వారా పార్టీని బలోపేతం చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి యడ్యూరప్పను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనే ఏకైక ఉద్దేశంతో తన మంత్రి పదవికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీకి నిజాయితీపరులైన కార్యకర్తలున్నారన్నారు. తాను రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించబోనన్నారు. అయితే 2019లో మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది, 2024లో రాజకీయ పదవీ విరమణ చేస్తానన్నారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు యశవ ంతరావ్ జాధవ్, మాజీ మంత్రి ఎంపీ రేణుకాచార్య, జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ఏ.జీవనమూర్తి, బీజేపీ నాయకుడు ఆనందప్ప తదితరులు పాల్గొన్నారు. -
యడ్డీ మళ్లీ సీఎం అవుతారు: ఈశ్వరప్ప
దావణగెరె : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవినలంకరించిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపడతారని విధాన పరిషత్ విపక్ష నేత కేఎస్ ఈశ్వరప్ప జోస్యం పలికారు. ఆయన సోమవారం దావణెగెరో విలేకరులతో మాట్లాడుతూ యడ్యూరప్ప పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపికవడం తనకు ముఖ్యమంత్రి అయినంత సంతోషం కల్గించిందన్నారు. ఇప్పటికే ప్రజలు ఎప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయా? ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని గద్దె దింపుదామా? అని ఎదురు చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రులు, అధికారులకు ప్రజా సేవ చేయాలనే ఆసక్తే లేదన్నారు. రాష్ట్రంలో 1000 రక్షిత మంచినీటి యూనిట్లు స్థాపించినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా ఎన్ని యూనిట్లు ఏర్పాటు చేసిందో గణాంకాలు వెల్లడించాలని సవాల్ విసిరారు. ఈ విషయంలో సంబంధిత మంత్రి హెచ్‌కే పాటిల్ వివరాలందించకుంటే ఆయనను ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు. -
‘తాగి మండలికి వస్తారేమో!’
సాక్షి,బెంగళూరు: శాసనమండలి విపక్షనాయకుడు ఈశ్వరప్పను పిచ్చాసుపత్రిలో చేర్చాలని అధికార పక్షం ఎమ్మెల్సీ ఆర్వీ వెంకటేశ్ సభలో పేర్కొనడం గందరగోళానికి దారి తీసింది. అయితే మండలి అధ్యక్షుడు శంకరమూర్తి కలుగజేసుకోవడంతో పరిస్థితి యథాస్థితికి వచ్చింది. వివరాలు...శాసనమండలిలో మంగళవారం సభా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో కే.ఎస్ ఈశ్వరప్ప మాట్లాడటానికి ప్రయత్నించారు. ఆయన ప్రసంగానికి కాంగ్రెస్ నాయకులు పదేపదే అడ్డుతగులుతూ వచ్చారు. దీంతో కోపగించుకున్న కే.ఎస్ ఈశ్వరప్ప ‘ఇవరు కుడుదు సభకు బర్తారో ఏనో (వీరు తాగి మండలికి వస్తారో ఏమో?) అని’ అన్నారు. వెంటనే కలుగజేసుకున్న ఆర్వీ వెంకటేష్ ఈయన్ను (కే.ఎస్ ఈశ్వరప్ప)ను పిచ్చాసుపత్రిలో చేర్పించండి. ఎలా మాట్లాడాలో తెలియడం లేదన్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అధ్యక్షుడు శంకరమూర్తి కలుగజేసుకోని ఇరు పక్షాల సభ్యులకు సర్థి చెప్పడంతో పరిస్థితి యథాస్థితికి వచ్చింది. -
అనుకున్నదే అయింది..!
రిస్ట్ వాచీ వ్యవహారంపై దద్దరిల్లిన ఉభయసభలు మౌనం వహించిన సీఎం సిద్ధు ప్రతిపక్షాల ముప్పేట దాడి ఈశ్వరప్ప ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు భారతరత్న విశ్వేశరయ్య, దివంగత నిజలింగప్పలను ఆదర్శంగా తీసుకోవాలి అంటూ హితవు సమయాన్ని మింగేసిన సీఎం సిద్ధు వాచ్! సభ నేటికి వాయిదా సాక్షి, బెంగళూరు:అనుకున్నదే జరిగింది... ‘గిఫ్ట్ వాచీ’ వ్యవహారం ఉభయసభలను కుదిపేసింది. విపక్షాలు అధికార పార్టీపై ముప్పేట దాడి చేశాయి. వివరణ ఇచ్చుకోవడంతో అధికార పార్టీ వ్యూహం ఫలించలేదు. అత్యంత విలువైన చట్టసభల సమయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డైమండ్ వాచ్ మింగేసింది!. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కరువు, విద్యుత్ తదితర సమస్యల పై ఒక్క నిమిషమైనా చర్చ జరగకుండానే సమావేశాల్లో రెండోరోజైన మంగళవారం గడిచిపోయింది. ఫిబ్రవరి 29న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా ప్రసంగించిన విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో రెండోరోజైన మంగళవారం శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఉదయం 11 గంటలకు వేర్వేరుగా ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లోనూ ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సాహితీవేత్తలతో పాటు సియాచిన్‌లో కురిసిన హిమపాతంలో చిక్కుకుని ప్రాణాలు విడిచిన సైనికులకు నివాళులు అర్పించారు. అటుపై శాసనసభలో స్పీకర్ కాగోడు తిమ్మప్ప, శాసనమండలిలో అధ్యక్షుడు శంకరమూర్తి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు జవాబులు ఇవ్వాలని (ప్రశ్నోత్తరాల సమయం) సూచించారు. అయితే శాసనమండలిలో విపక్షనాయకుడైన కే.ఎస్ ఈశ్వరప్ప లేచి ‘ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విదేశాల్లో ఉన్న ఒక వ్యక్తి ఖరీదైన వాచ్‌ను తనకు గిఫ్ట్‌గా ఇచ్చారు.’ అని బహిరంగంగా ఒప్పుకున్నారు. అయితే ఆ వ్యక్తి ఎందుకు ఇచ్చారు? అన్న విషయంపై చర్చ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందుకు అధికారపక్ష నాయకుడు ఎస్.ఆర్ పాటిల్‌తో పాటు ఆ పార్టీ సభ్యులందరూ అభ్యంతరం చెప్పారు. అంతేకాకుండా వివిధ సందర్భాల్లో రాష్ట్ర బీజేపీ నాయకులైన యడ్యూరప్ప, సదానందగౌడతోపాటు ప్రధాని నరేంద్రమోదీలు ఖరీదైన వాచ్‌లు, సూట్లలో ఉన్న ఫొటోలను ప్రదర్శించి బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సమయంలో జేడీఎస్ పార్టీ ఎమ్మెల్సీలు బీజేపీ సభ్యులకు అండగా నిలబడ్డారు. ముఖ్యంగా ఆ పార్టీకు చెందిన సీనియర్ ఎమ్మెల్సీ బసవరాజ్ హొరట్టి ‘సభాపతి శంకరమూర్తి విపక్షనాయకుడు ఈశ్వరప్పకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. అయితే విపక్షాలు ఆయన్ను మాట్లాడనీయకుండా అడ్డుకున్నాయి. ఇది ఎమ్మెల్సీ సభ్యుడికి ఉన్న హక్కును హరించడమే అవుతుంది.’ అని పేర్కొన్నారు. అయినా పట్టువిడవని అధికార పక్షం నాయకులు కే.ఎస్ ఈశ్వరప్ప ప్రసంగాన్ని పదేపదే అడ్డుకుంటూ వచ్చారు. పరిస్థితిని అదుపుచేయడానికి సభను రెండు సార్లు వాయిదా వేసినా ప్రయోజనం లేకపోయింది. బీజేపీ, జేడీఎస్ సభ్యులు కే.ఎస్ ఈశ్వరప్పకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాల్సిందేనంటూ వెల్‌లోకి దూసుకువచ్చి నిరసనకు దిగడంతో సభను యథావిధిగా జరపలేమని భావించిన శంకరమూర్తి నేటి (బుధవారం) ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ఆత్మావలోకనం చేసుకోవాలి... శాసనసభలో కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డైమండ్ వాచ్ వివాదం ప్రతిధ్వనించింది. ఈ విషయమై చర్చకు అనుమతివ్వాల్సిందగా విపక్షనాయకుడు జగదీష్‌శెట్టర్ పట్టుబట్టారు. అయితే సిద్ధరామయ్య వాచ్ ధరించడం చాలా చిన్న విషయమని...దీనిపై విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని బెంగళూరు నగరాభివృద్ధిశాఖ మంత్రి కే.జే జార్జ్ ఎదురుదాడికి దిగారు. ఇంతలో శాసనసభలోని మంత్రులతోపాటు కాంగ్రెస్ శాసనసభ్యులు రాష్ట్ర బీజేపీ నాయకులు వివిధ సందర్భాల్లో ధరించిన ఖరీదైన వాచ్‌ల ఫొటోలను ప్రదర్శించారు. అయినా వెనక్కుతగ్గని జగదీశ్ శెట్టర్ సీఎం సిద్ధరామయ్య వ్యక్తిగతంగా ఎంత ఖరీధైన వాచ్‌ను ధరించినా తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే ప్రజల ఓట్లతో ఎన్నుకోబడిన నాయకులు లక్షల విలువ చేసే వాచ్‌లు ధరించడం ఎంత వరకూ సమంజసమో చెప్పాలని నిలదీశారు. ‘రూ.5 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను బహుమతి రూపంలో ప్రజాప్రతినిధులు తీసుకోకూడదన్న నిబంధన ఉంది. ఒక వేళ తీసుకున్నా అందుకు అవసరమైన ధృవీకరణ పత్రాలు సమర్పించాలి.’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్ కలుగజేసుకుని...‘ఖరీదైనా వస్తువులను గిఫ్ట్‌గా ఇచ్చే వారు అంతేకంటే ఎక్కువ విలువైన పనులను చేయించుకోవాలని చూస్తారు. ఇది సహజం. ఒకవేళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు శక్తి ఉంటే ఈ వాచ్‌కు సంబంధించిన వివాదం నుంచి బయటపడుతారు. ప్రజాప్రతినిధులమైన మనమంతా ఆత్మావలోకనం చేసుకోవాలి. నిజలింగప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాచ్ గిఫ్ట్‌గా వచ్చినప్పుడు ఆయన తీసుకోలేదు. ఇక భారత రత్న విశ్వేశరయ్య తనతో ఎప్పుడూ రెండు పెన్నులను ఉంచేకునే వారు. ఒకటి ప్రభుత్వ కార్యకలాపాలకు మరొకటి సొంత పనులకు ఉపయోగించేవారు. ఈ విషయాలను మనం సదా స్మరిస్తూ ఆచరించాలి. అయితే రాష్ట్రంలో ప్రజలు పలు సమస్యలతో బాధపడుతున్న సమయంలో వాటిపై చర్చించాలి కాని వాచ్‌లపై చర్చిస్తే ప్రజల దృష్టిలో చులకనైపోతాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెండికుర్చీను శివకుమార్ స్వామీజీకి ఇచ్చాను... వాచ్‌పై చర్చ జరుగుతున్న సమయంలోనే బయటి నుంచి శాసనసభలోకి వచ్చిన జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామిని ఉద్దేశిస్తూ స్పీకర్ కాగోడు తిమ్మప్ప మాట్లాడారు. ‘మీకు వెండి కుర్చీ గిఫ్ట్‌గా వచ్చింది కదా? దాన్ని ప్రభుత్వానికి అప్పగించారా?’ అంటూ ప్రశ్నించారు. ఇందుకు కుమారస్వామి సమాధానమిస్తూ నాకు గిఫ్ట్‌గా వచ్చిన వెండికుర్చీని సిద్ధగంగ మఠం పీఠాధిపతి శివకుమార్ స్వామీజీకి ఇచ్చాను.’ అని సమాధానమిచ్చారు. ఇందుకు మంత్రిమండలి అనుమతి పొందారా? అని ప్రశ్నించగా ‘నాకు గిఫ్ట్ ఇచ్చే సమయంలో వేదికపై ఉన్న సభ్యుల అనుమతి తీసుకుని శివకుమార్ స్వామీజీకి ఇచ్చాను.’ అని కుమారస్వామి సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా చర్చ జరుగుతున్నంత సేపు శాసనసభలో దాదాపు గంటన్నర మౌనంగా కుర్చొన్న సిద్ధరామయ్య అనంతరం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను నిబంధనలకు విరుద్ధంగా గిఫ్ట్ పొందలేదని ఈ విషయమై విపక్షాలు అనవసర ఆందోళన చేస్తున్నాయన్నారు. దీంతో సభలో తిరిగి కలాకలం మొదలైంది. విపక్షసభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేయడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప శాసనసభను నేటి(బుధవారం) ఉదయానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. -
'మిమ్మల్ని రేప్ చేస్తే.. మేమేం చేస్తాం'
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత, ప్రతిపక్ష నేత కేఎస్ ఈశ్వరప్ప మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళా జర్నలిస్టును ఉద్దేశించి 'మిమ్మల్ని లాక్కెళ్లి అత్యాచారం చేస్తే, ప్రతిపక్ష పార్టీ అయిన మేం ఏం చేయగలం' అని ఈశ్వరప్ప అన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కర్ణాటకలో అత్యాచారాలను అరికట్టడంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర గురించి మహిళా జర్నలిస్టు ప్రశ్నించగా.. 'మీరు మహిళ. ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ఎవరో మిమ్మల్ని లాక్కెళ్లి అత్యాచారం చేస్తే.. ప్రతిపక్ష పార్టీ వారైనా మేం ఎక్కడో ఉంటాం. అప్పుడు మేం ఏం చేయగలం. మేమేం చేయగలమో మీరే చెప్పండి. అది చేస్తాం' అని అన్నారు. ఈశ్వరప్ప వ్యాఖ్యలు బాధ్యతారహితమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, న్యాయ శాఖ మంత్రి జయచంద్ర ఖండించారు. తనపై విమర్శలు రావడంతో ఈశ్వరప్ప తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. 'కర్ణాటక మహిళలను తన సోదరీమణులుగా భావిస్తాను. మహిళలకు రక్షణ కల్పించే విషయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం' అని చెప్పారు. ఈశ్వరప్ప ఇంతకుముందు కూడా ఇదే విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
‘ఈశ్వరప్ప భార్యను రేప్ చేస్తే ఏం చేయగలడు?’
మంగళూరు: సభ్యసమాజం సిగ్గుతో తలొంచుకునే రీతిలో కర్ణాటకలో చిన్నారులపై అత్యాచారాల కేసులు నమోదవుతుండగా, మరోవైపు రాజకీయ నేతల దిగజారుడు వ్యాఖ్యలు మరింత వికతరూపం దాల్చాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోం మంత్రి కేజే జార్జి కుమార్తెలపై అత్యాచారం జరిగితేగానీ వాళ్లకు సమస్య తీవ్రత ఏమిటో తెలిసొచ్చే అవకాశం లే దంటూ బీజేపీ నేత ఈశ్వరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై, స్పందిస్తూ ఇవాన్ డిసౌజా అనే నామినేటెడ్ ఎమ్మెల్సీ మరింతగా దిగజారుడు మాటలతో వికృతంగా ప్రవర్తించారు. ‘శాసనమండలిలో ప్రతిపక్షనేత హోదాలో ఉన్న మనిషి అలా మాట్లాడ్డమేమిటి? ఆయన ఎప్పుడూ సభను కూడా సరిగా జరగనిచ్చే రకంకాదు. గతంలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఆయనంటే నాకు గౌరవం ఉంది. అయితే మండలిలో ఆయనలాంటి వ్యక్తి ప్రతిపక్ష నేత అని చెప్పుకోడానికే నాకు సిగ్గుగా ఉంది. నోరు అదుపులో పెట్టుకోవడం ఆయన నేర్చుకోవాలి. సీఎం కుమార్తె, హోంమంత్రి కుమార్తెలపై అత్యాచారం అంటాడేమిటి? అసలు ఈశ్వరప్ప భార్యను నేను రేప్ చేస్తే ఆయన ఏం చేయగలడు? ఆయన స్పందనేమిటి? ఆయనలా మాట్లాడడ్డం రాజకీయాల్లో సరైన సంస్కతి కానేకాదు.’ అంటూ విపరీత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన మాటలను మీడియా, పార్టీ నేతలు కూడా తప్పుబట్టేసరికి డిసౌజా తమాయించుకొని ఈశ్వరప్పకు క్షమాపణ చెప్పేశారు. -
వారి కూతుళ్లపై రేప్‌లు జరిగితే తెలిసొస్తుంది
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో గత కొన్ని నెలలుగా చిన్నారులపై అత్యాచార ఘటనలు పెరుగుతుండటంపై ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో ప్రతిపక్ష బీజేపీ నేత కె.ఎస్. ఈశ్వరప్ప శుక్రవారం నోరుజారారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి కె.జె. జార్జ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం, హోంమంత్రుల కుమార్తెలపై ఒకవేళ అత్యాచారం జరిగితే అప్పుడు ఆ బాధ ఏమిటో వారికి తెలుస్తుందంటూ వ్యాఖ్యానించి రాజకీయ దుమారం రేపారు. ‘‘రేప్‌లపై ఓవైపు రాష్ట్రం అట్టుడుకుతుంటే ఒకరేమో (హోంమంత్రి) టీఆర్పీ రేటింగ్లకోసమే మీడియా హడావిడి చేస్తోందంటారు. మరొకరేమో (సీఎం) ఆ ప్రకటనను పరిశీలిస్తానంటారు. ఒకవేళ వాళ్ల కుమార్తెలపై అత్యాచారాలు జరిగితేనే వారికి ఆ తీవ్రత తెలుసొస్తుంది’’ అని ఈశ్వరప్ప విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను అధికార కాంగ్రెస్‌తోపాటు బీజేపీ సైతం తీవ్రంగా తప్పుబట్టింది. నాగరికులెవరూ ఈశ్వరప్పలా చౌకబారు మాటలు మాట్లాడరని సీఎం సిద్ధరామయ్య దుయ్యబట్టగా తమ పార్టీ నేత అలా మాట్లాడిఉండాల్సింది కాదని, ఇకపై అటువంటి వ్యాఖ్యలు చేయరాదని ఈశ్వరప్పకు సూచిస్తామని బీజేపీ కర్ణాటక విభాగం చీప ప్రహ్లాద్ జోషీ చెప్పారు. తన వ్యాఖ్యలపై దుమా రం రేగడంతో ఈశ్వరప్ప నష్టనివారణ చర్యలకు ప్రయత్నించా రు. మహిళలంటే తనకు గౌరవమని... సీఎం, హోంమంత్రి కూతుళ్లు తనకు చెల్లెళ్ల వంటి వార ని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యల్లో కొన్నింటినే మీడియా చూపుతోందని మండిపడ్డారు. కాగా, సీఎం సిద్ధరామయ్యకు ఇద్దరు కొడుకులు తప్ప కూతుళ్లు లేకపోవడం కొసమెరుపు. -
మళ్లీ మొదటికి...
* బీఎస్‌వై కుటుంబ సభ్యులు, ఈశ్వరప్పపై విచారణకు ‘హైకోర్టు’ అనుమతి * సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశం * సంకటంలో యడ్యూరప్ప, ఈశ్వరప్ప సాక్షి, బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తులు, అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, ఆయన కుమారుడు రాఘవేంద్ర, కుమార్తె అరుణాదేవిలతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్పలపై విచారణకు హైకోర్టు అనుమతించింది. బీఎస్‌వై కుటుంబంతో పాటు ఈశ్వరప్పపై విచారణకు ఆదేశించాల్సిందిగా న్యాయవాది వినోద్‌కుమార్ వేసిన ప్రైవేటు కేసును విచారించిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ కేసు విచారణపై స్టేను విధిస్తూ శివమొగ్గ లోకాయుక్త కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు తాజాగా రద్దు చేసింది. దీంతో బీఎస్‌వై కుటుంబంతో పాటు ఈశ్వరప్ప ఇబ్బందికర పరిస్థితుల్లో పడినట్లైంది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఆయన కుమారుడు రాఘవేంద్ర శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని హుణసకట్టె సమీపంలోని భద్రా పులుల అభయారణ్యానికి చెందిన 69 ఎకరాల భూమిని బినామీ వ్యక్తుల పేరిట నకిలీ ధ్రువీకరణ పత్రాలు రూపొందించి కొనుగోలు చేశారని న్యాయవాది వినోద్ కొంతకాలం క్రితం ఆరోపించారు. అంతేకాక ఈ భూమిని కోట్లాది రూపాయలకు అక్రమంగా అమ్ముకున్నారని పేర్కొన్నారు. ఇక యడ్యూరప్ప కుమార్తె అరుణాదేవి కూడా కేహెచ్‌బీ సైట్లను బినామీ పేరిట సొంతం చేసుకొని వాటిని కోట్లాది రూపాయలకు అమ్ముకోవడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప సైతం శివమొగ్గ జిల్లాలో అక్రమంగా కోట్లాది రూపాయల ఆస్తిని సంపాదించారని, శివమొగ్గ ప్రాంతంలో 4,39,898 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించారని, ఆయనకుటుంబ సభ్యుల పేరిట అనేక ప్రాంతాల్లో అక్రమ ఆస్తిని కూడబెట్టారని ఆరోపిస్తూ, ఇందుకు సంబంధించి సమగ్ర విచారణను నిర్వహించి నిజానిజాలను నిగ్గుతేల్చాల్సిందిగా కోరుతూ శివమొగ్గ లోకాయుక్త కోర్టును ఆశ్రయించారు. అయితే సరైన ఆధారాలు, అనుమతులు లేనందున ఈ విచారణను నిలిపివేయాలని యడ్యూరప్ప, ఈశ్వరప్పలు శివమొగ్గ లోకాయుక్త కోర్టును కోరడంతో కోర్టు ఈ విచారణపై స్టే విధించింది. దీంతో న్యాయవాది వినోద్ హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన కేసుపై మంగళవారం పూర్తి స్థాయి విచారణను జరిపిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం శివమొగ్గ లోకాయుక్త కోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేసింది. అంతేకాక యడ్యూరప్ప, రాఘవేంద్ర, అరుణాదేవి, ఈశ్వరప్పలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సమగ్ర దర్యాప్తుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. -
ప్రజల చూపంతా మోడీపైనే
మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప హొస్పేట, న్యూస్‌లైన్ : గుజరాత్ ముఖ్యమంత్రిని దేశ ప్రధానిగా చూడాలని దేశప్రజలు ఆకాంక్షిస్తున్నారని బీజేపీ నేత, రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప పేర్కొన్నారు. హొస్పేటలోని సహకార కల్యాణ మంటంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చి నరేంద్ర మోడీని ప్రధానిని చేయడానికి కార్యకర్తలు, నాయకులు కష్టించి పనిచేయాలన్నారు. అన్ని జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రాథమిక స్థాయి నుంచి కార్యకలాపాలు చేపట్టామని తెలిపారు. బీజేపీ హయాంలో రాష్ర్టం ఎంతో అభివృద్ధి సాధించిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదన్నారు. రైతుల సమస్యలపై మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం చెరుకు, వక్క తదితర పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించలేదన్నారు. పాకిస్థాన్ సైనికులు భారత సైనికులను ఎత్తుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి హతమారుస్తున్నా కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఇలాంటి సంఘటనలకు అస్కారం ఉండదన్నారు. దేశం ఆర్థిక, విద్య, సైనిక రంగాల్లో అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలన్నారు. ఇందుకు కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి సైనికుల్లా పని చేయాలన్నారు. బీజేపీలో కుమ్ములాటలవల్లే రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇకపై అలాంటి తప్పులు పునరావృతం కాకుండా పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీలో మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నేమిరాజ్ నాయక్, నాయకులు రామలింగప్ప, అశోక్ గస్తీ, విధాన పరిషత్ ముఖ్యనేత శివయోగిస్వామి, మాజీ ఎమ్మెల్యేలు సోమలింగప్ప తదితరులు పాల్గొన్నారు.