'మిమ్మల్ని రేప్ చేస్తే.. మేమేం చేస్తాం' | What Can we Do If 'Someone Rapes You?' Karnataka BJP Leader to Journalist | Sakshi
Sakshi News home page

'మిమ్మల్ని రేప్ చేస్తే.. మేమేం చేస్తాం'

Published Sat, Oct 17 2015 7:48 PM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

'మిమ్మల్ని రేప్ చేస్తే.. మేమేం చేస్తాం'

'మిమ్మల్ని రేప్ చేస్తే.. మేమేం చేస్తాం'

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత, ప్రతిపక్ష నేత కేఎస్ ఈశ్వరప్ప మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళా జర్నలిస్టును ఉద్దేశించి 'మిమ్మల్ని లాక్కెళ్లి అత్యాచారం చేస్తే, ప్రతిపక్ష పార్టీ అయిన మేం ఏం చేయగలం' అని ఈశ్వరప్ప అన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

కర్ణాటకలో అత్యాచారాలను అరికట్టడంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర గురించి మహిళా జర్నలిస్టు ప్రశ్నించగా.. 'మీరు మహిళ. ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ఎవరో మిమ్మల్ని లాక్కెళ్లి అత్యాచారం చేస్తే.. ప్రతిపక్ష పార్టీ వారైనా మేం ఎక్కడో ఉంటాం. అప్పుడు మేం ఏం చేయగలం. మేమేం చేయగలమో మీరే చెప్పండి. అది చేస్తాం' అని అన్నారు. ఈశ్వరప్ప వ్యాఖ్యలు బాధ్యతారహితమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, న్యాయ శాఖ మంత్రి జయచంద్ర ఖండించారు. తనపై విమర్శలు రావడంతో ఈశ్వరప్ప తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. 'కర్ణాటక మహిళలను తన సోదరీమణులుగా భావిస్తాను. మహిళలకు రక్షణ కల్పించే విషయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం' అని చెప్పారు. ఈశ్వరప్ప ఇంతకుముందు కూడా ఇదే విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement