బెంగళూరు: రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠకు గురిచేసిన శివమొగ్గ నగర నియోజకవర్గం టికెట్‌ను ఎట్టకేలకు బీజేపీ అధిష్టానం చన్నబసప్ప (చెన్ని)కు కేటాయించింది. వయసు రీత్యా రాజకీయాల నుంచి తప్పుకుని తన కుమారుడికి టికెట్ ఇప్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేసిన మాజీ మంత్రి ఈశ్వరప్పకు తీవ్ర నిరాశ మిగిలింది. కుటుంబ రాజకీయలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ ఆయన విన్నపాన్ని ఖాతరు చేయలేదు. పైగా పలు ఆరోపణలు కూడా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో కొత్త వ్యక్తి, మహానగర పాలికె కార్పొరేటర్ చెన్నబసప్పకే టికెట్ కేటాయించారు.
సిద్దు ఆస్తులు రూ.50 కోట్లు.. రూ. 23 కోట్ల అప్పులు
మైసూరు: వరుణ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సీఎం అయిన సిద్దరామయ్య ఆస్తి గడిచిన ఐదు సంవత్సరాలో రెండున్నర రెట్లు పెరిగింది. ప్రస్తుతం సిద్దరామయ్య మొత్తం ఆస్తి రూ.50.77 కోట్లుగా ఉంది. ఇందులో రూ. 21.35 కోట్లు చరాస్తులు, రూ. 29.4 కోట్లు స్థిరాస్తులు. అప్పులు రూ.23.7 కోట్లుగా తెలిపారు. 2013 ఎన్నికల్లో ఆయన ఆస్తి రూ.13.61 కోట్లు, 2018 ఎన్నికల్లో రూ. 20.36 కోట్లుగా ఉండేది. తాజాగా ఆయన అప్పులు కూడా భారీగా ఉన్నాయి. ఆయనకు రూ. 6.14 కోట్ల అప్పు, సతీమణికి రూ.16.24 కోట్ల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు.
చదవండి: నామినేషన్ల ఘట్టం సమాప్తం.. ఇక ప్రచార హోరు!
Comments
Please login to add a commentAdd a comment