
సాక్షి, కర్ణాటక: ఇటీవల సీఎం యడియూరప్ప, బీజేపీ వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లు వార్తల్లోకి ఎక్కిన కత్తి సోదరులు, మురుగేశ్ నిరాణి తమ డిమాండ్లను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రమేశ్ కత్తికి రాజ్యసభ టికెట్‌కు సిఫార్సు చేసినందుకు ధన్యవాలు తెలిపారు. ఆదివారం ఉదయం సీఎం నివాసం కావేరిలో కత్తి సోదరులు, నిరాణి వెళ్లి కలిశారు. కాగా, డిమాండ్ల సాధనకు ఉమేశ్ కత్తి ఆధ్వర్యంలో నిరాణి తదితర బీజేపీ ఎమ్మెల్యేలు విందు రాజకీయం నిర్వహించడం తెలిసిందే. దీంతో యడియూరప్ప వారిని పిలిపించి బుజ్జగించారు. మురుగేశ్ నిరాణి వర్గానికి మండ్య జిల్లా పాండవపుర సహకార కార్మాగారాన్ని 40 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్‌కు అప్పగించినట్లు తెలిసింది. చదవండి: ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక రాజకీయాలు
Comments
Please login to add a commentAdd a comment