టిప్పు జయంతి నిర్వహించొద్దు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప
బెంగళూరు: ఎట్టి పరిస్థితుల్లోనూ టిప్పు జయంతిని ప్రభుత్వం నిర్వహించకూడదని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు విరుద్ధంగా జరిగితే పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా వీధి పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా టిప్పు జయంతిని నిర్వహించాలని భావించడం సరికాదన్నారు. దీని వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కన్నడ మాత భువనేశ్వరీదేవి విగ్రహాన్ని పూర్తి చేస్తామన్నారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భువనేశ్వరీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం రూ.25 కోట్లను బడ్జెట్‌లో కేటారుుంచినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ... నదీ జలాల విషయంలో సిద్ధరామయ్య రాజకీయాలు చేయడం తగదన్నారు. కావేరి, మహదారుు విషయంలో కేంద్రానిదే బాధ్యత అన్నట్లు భ్రమలు కల్పించే ప్రయత్నం మానుకోవాలన్నారు. శాంతిభద్రతల అదుపు చేయడంలో కూడా సిద్ధరామయ్య విఫలమయ్యారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రుద్రేశ్ హత్య విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా సిద్ధు ప్రభుత్వం వ్యవహరిస్తోందని అనంతకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.