
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం మరోసారి దర్శించుకున్నారు. సీఎం జగన్‌తో కలిసి కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం వద్ద ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఇరు ముఖ్యమంత్రులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనము ముగించుకుని ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనంకు ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు చేరుకున్నారు. లోక కళ్యాణర్ధం కరోనా నేపథ్యంలో టీటీడీ గత మార్చి నెలనుంచి ధన్వంతరి మహా యాగం, ధన్వంతరి యోగ వశిష్ట్యం, గీతా పారాయణం, సుందరకాండ పారాయణం నిర్వహిస్తోన్న కార్యక్రమంలో ఇరువురు సీఎం పాల్గొన్నారు. ఉదయం 8:10 గంటలకు కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి సీఎం జగన్ కర్ణాటక సత్రాల భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొననున్నారు. అనతంరం ఉదయం 10:20కి రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎం జగన్ గన్నవరం బయల్దేరనున్నారు.
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment