సాక్షి, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమవుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని సంప్రదాయల ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 23న తిరుమల శ్రీవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం 7గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తిరుమల చేరుకుంటారని, ఈనెల 24వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు శ్రీవారి దర్శించుకుంటారని వెల్లడించారు. (బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ)
అనంతరం శ్రీవారి ఆలయం ఎదుట నాద నీరాజనంలో జరిగే సుందరకాండ పారాయణంలో పాల్గొంటారని తెలిపారు. తిరుమలలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించే వసతి సముదాయాల శంకుస్థాపన కార్యక్రమములో ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తున్నామని ఆయన తెలిపారు.(బాబు మరో జన్మెత్తినా వైవీ కుటుంబానికి సాటిరారు)
Comments
Please login to add a commentAdd a comment