యడ్యూరప్ప చిన్నారులకు కేక్‌ను చాకుతో తినిపిస్తున్న దృశ్యం (ఫైల్)
బొమ్మనహళ్లి : రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి రేవణ్ణ కొడగులో వరద బాధితులకు బిస్కెట్ పాకెట్లను విసిరివేయడం తప్పని చెబుతున్న బీజేపీ నాయకులు మాజీ సీఎం యడ్యూరప్ప తన పుట్టిన రోజున కేక్ కట్ చేసి చాకుతో విద్యార్థులకు కేక్ తినిపించడాన్ని ఏమనాలని జేడీఎస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు వారు సోషల్ మీడియాలో యడ్యూరప్ప చాకుతో ఓ విద్యార్థికి కేక్ తినిపిస్తున్న ఫొటో పెట్టడంతో అది వైరల్‌గా మారింది. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న యడ్యూరప్ప ఇటీవల పేదల మధ్య తన పుట్టిన రోజును జరుపుకొని వారికి కేక్ చేత్తో తినిపించకుండా చాకుతో తినిపించడాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment