
న్యూఢిల్లీ: నేడు రాజ్యసభ ముందుకు రానున్న ట్రిపుల్ తలాక్ (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ)బిల్లులో సవరణల కోసం ఒత్తిడి చేయొద్దని కాంగ్రెస్‌ను కేంద్రం కోరింది. లోక్‌సభలో సహకరించినట్లుగానే రాజ్యసభలోను బిల్లు ఆమోదానికి సాయపడాలని కాంగ్రెస్‌ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ కోరారు. ఈ బిల్లుపై లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ సవరణలు కోరినా ఒత్తిడి చేయలేదు. బిల్లుపై చర్చ కోసం సమయం కేటాయించాలని మంగళవారం సమా వేశమైన రాజ్యసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించింది. అయితే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ కోరినట్లు సమాచారం.