పేద కుటుంబానికి ఆదుకున్న హీరో.. సోషల్ మీడియాలో వైరల్! | Bollywood Actor Sonu Sood Helps Poor Family For Heart Surgery | Sakshi
Sakshi News home page

Sonu Sood: బాలుడికి అండగా సోనూ సూద్.. రియల్‌ హీరో అంటోన్న నెటిజన్స్‌!

Published Fri, Jun 7 2024 9:59 PM | Last Updated on Fri, Jun 7 2024 9:59 PM

Bollywood Actor Sonu Sood Helps Poor Family For Heart Surgery

బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌ పరిచయం అక్కర్లేని పేరు. అరుంధతిలో పశుపతి పాత్రలో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. అంతేకాదు.. తెలుగులో ‍అల్లు అర్జున్‌ చిత్రం జులాయిలో తన నటనతో ఆకట్టుకున్నారు. చాలా సినిమాల్లో విలన్‌ పాత్రల్లో మెప్పించారు. అయితే సోనూ సూద్‌ తెరపై మాత్రమే కాదు.. అభిమానుల గుండెల్లో రియల్‌ హీరోగా పేరు సంపాదించుకున్నారు. కరోనా సమయంలో వేలమందికి అండగా నిలిచారు.

తాజాగా మరో నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి గొప్ప మనసును చాటుకున్నారు. డెహ్రాడూన్‌కు చెందిన ఓ పేద కుటుంబంలోని మూడేళ్ల బాలుడికి వైద్య సాయమందించారు. అత్యవసరంగా గుండెకు సర్జరీ చేయాల్సి రావడంతో సోనూ సూద్‌ ఆదుకున్నారు. ఆ బాలుడికి సర్జరీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయించారు. ఇది చూసిన నెటిజన్స్‌ సోనూ రియల్‌ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు. సోనూసూద్‌ ఫౌండేషన్‌ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. సోనూ సూద్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement