ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, రాయదుర్గం: కరోనా కాలంలో సంక్లిష్టమైన హృద్రోగ చికిత్స చేసి 60 ఏళ్ల ఐటీ నిపుణుడికి పునర్జన్మను ప్రసాదించారు నానక్‌రాంగూడలోని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం... హైపర్ టెన్షన్, ఎడమవైపు చాతిలో నొప్పి, దడ వంటి లక్షణాలతో బాధపడుతున్న 60 ఏళ్ల వ్యక్తి ఆరు నెలలుగా మందులు వాడినా ఎలాంటి ఉపశమనం కలగలేదు. దీంతో ఆయన కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరాడు.
ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఆశుతోష్‌కుమార్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మీరాజీరావు, వైద్యాధికారులు అభిషేక్ మొహంతి, రామకృష్ణుడు ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రెండు దశల్లో చికిత్సను చేశారు. ప్రధానంగా 3డీ(త్రీ డైమెన్షనల్) కార్డియాక్ మ్యాపింగ్ అనే అత్యాధునిక గుండె చికిత్స పద్ధతిని, అరిథ్మియాను సరిదిద్దడానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఆబ్లేషన్ ప్రాసెస్‌ను వినియోగించారు. నాలుగు గంటలకుపై శ్రమించి చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి రోగి ప్రాణాలను కాపాడారు.
Comments
Please login to add a commentAdd a comment