సత్యసాయి ట్రస్ట్ అందిస్తున్న సేవలపైమాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశంసలు
6 రోజుల్లో 18 మందికి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయడం గొప్ప విషయమని కితాబు.. ప్రభుత్వం చేయని పనిని ట్రస్ట్ చేస్తోందని వ్యాఖ్య
సిద్దిపేటలోని సత్యసాయి ఆస్పత్రి సందర్శన
సాక్షి, సిద్దిపేట: మరణం అంచుకి వెళ్లిన చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి పునర్జన్మనిస్తూ, తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా, తెలుగు ప్రజలకు సంజీవనిలా సత్యసాయి ఆస్పత్రి సేవలందిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో శ్రీసత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్‌కేర్, రీసెర్చ్‌లో తొలిసారి గుండె ఆపరేషన్లు జరగ్గా.. శనివారం హరీశ్‌రావు సందర్శించిన అనంతరం మాట్లాడారు. దేశంలో 5వ ఆస్పత్రిని సిద్దిపేటలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.
ప్రభుత్వం చేయని పనిని సత్యసాయి ట్రస్ట్, మధుసూదన్ సాయి చేస్తున్నారని కొనియాడారు. గుండె ఆపరేషన్ల కోసం రూ.3 నుంచి రూ.5 లక్షలు ఖర్చు పెట్టలేక ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, ఉచితంగా సర్జరీలు చేయడం అభినందనీయం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో 5.77 లక్షల మందికి ఓపీ, 33,600 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేశారన్నారు. ఆరు రోజుల్లో 18 మంది చిన్నారులకు సర్జరీలు పూర్తి చేసి వారికి పునర్జన్మ ప్రసాదించడం గొప్ప విషయం అని కొనియాడారు.
మధుసూదన్ సాయి కళాశాల వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమానికి వచి్చనప్పుడు ఇక్కడ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని 2022లో కోరానని, దీంతో స్పందించి 2023లో ఓపీ ప్రారంభించారని తెలిపారు. మంత్రి, ఎమ్మెల్యే పదవుల్లో అనుభూతి కంటే గుండె ఆపరేషన్ అయిన తర్వాత పిల్లల్లో సంతోషం చూసి తన జన్మ ధన్యమైందన్నారు.
శ్రీసత్యసాయి ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ మొదట కొండపాకలో యంగ్ అడోల్సెంట్ కార్యక్రమం నిర్వహించాలనుకున్నా.. హరీశ్‌రావు చొరవతో ఇక్కడ గుండె శస్త్రచికిత్సల ఆస్పత్రిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కఫొటోతో బాడీ ప్రొఫైల్ వచ్చే విధంగా హెచ్‌డీ స్టెత్‌తో గుండె పనితీరు తెలుసుకునే అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమణాచారి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు.
ఆరు నెలల కిందట తెలిసింది
నా బిడ్డ పేరు రక్ష. వయసు పదేళ్లు. ఆర్నెల్ల కిందట నిలోఫర్‌లో డాక్టర్లు పరిశీలించి గుండెలో హోల్ ఉందని చెప్పారు. బయట ఆస్పత్రుల్లో రూ.5 లక్షలు అవుతాయన్నారు. అయితే సిద్దిపేటలో ఫ్రీగా గుండె ఆపరేషన్లు చేస్తారని నిలోఫర్ డాక్టర్లు చెప్పారు. దీంతో అక్కడ ఆపరేషన్ చేయించాం. ఈ డాక్టర్లకు, ట్రస్ట్‌కు మేము రుణపడి ఉంటాం. నా బిడ్డ కూడా డాక్టర్ అయి ఇలా ఉచితంగా సేవలందిస్తుంది.
ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం
మాది మెదక్ జిల్లా చిన్నశంకరంపే ట. మెకానిక్ గా పని చేస్తా. నా బిడ్డ వయసు ఆరేళ్లు. దగ్గు, జలుబు, వాంతులు అయ్యా యి. అప్పుడు వెంటనే లోకల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. వారు చూసి గుండె స్పీడ్ గా కొ ట్టుకుంటోంది అని చెప్పారు. దీంతో నిమ్స్, నిలోఫర్ ఆ స్పత్రులు తిరిగాం. ఇక్కడ ఫ్రీగా చేస్తారని తెలిసింది వెంటనే వచ్చాం. నా బిడ్డకు పునర్జన్మనిచి్చన డాక్టర్లు, ట్రస్ట్ వారికి ఏమిచి్చనా రుణం తీర్చుకోలేం.
Comments
Please login to add a commentAdd a comment