నవాజ్ షరీఫ్‌ త్వరగా కోలుకోవాలి: మోదీ | PM Narendra Modi Extends Best Wishes To Nawaz Sharif For His Heart Surgery | Sakshi
Sakshi News home page

నవాజ్ షరీఫ్‌ త్వరగా కోలుకోవాలి: మోదీ

Published Sat, May 28 2016 9:13 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

PM Narendra Modi Extends Best Wishes To Nawaz Sharif For His Heart Surgery

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ త్వరగా కోలుకోవాలని నరేంద్రమోదీ ముందస్తుగా ఆకాక్షించారు. ఈ మేరకు మోదీ ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. నవాజ్ షరీఫ్‌ ఈ నెల31న గుండె ఆపరేషన్  కోసం బ్రిటన్ వెళ్లనున్నారని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా అసిఫ్ ధ్రువీకరించారు.

వైద్యుల సూచన మేరకు ఆయన ఒక వారం పాటు లండన్ లో ఉంటారు. నవాజ్ కూతురు మర్యమ్ నవాజ్ కూడా ఆయనతోపాటు అండన్ వెళ్తున్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 2011లో ప్రధాని గుండెకు జరిగిన ఆపరేషన్ వల్ల ఇప్పుడు మరో సమస్య ఉత్పన్నమైందని, దీనిని వైద్యులు నిర్ధారించారని మార్యమ్ చెప్పారు. సర్జరీ కోసం వారం పాటు ప్రధాని బ్రిటన్ వెళ్లనున్నారని ఆయన క్షేమం కోసం పాకిస్థాన్ ప్రజలు అల్లాకు ప్రార్థనలు చేయాలని కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement