చిన్నారులకు సాయం సంతృప్తికరం: సమంత | Samantha helps 17 kids for Heart Surgery | Sakshi
Sakshi News home page

చిన్నారులకు సాయం సంతృప్తికరం: సమంత

Published Sat, Dec 5 2015 7:06 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

చిన్నారులకు సాయం సంతృప్తికరం: సమంత

చిన్నారులకు సాయం సంతృప్తికరం: సమంత

విజయవాడ (లబ్బీపేట) : ప్రత్యూష సపోర్ట్ చారిటీస్ సహకారంతో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు చేయించడం తనకు అత్యంత సంతృప్తి కలిగిస్తోందని ట్రస్టు నిర్వాహకురాలు, సినీ నటి సమంత పేర్కొన్నారు. పిల్లలకు వైద్య సహాయం అందించడం మంచి కార్యక్రమమని, ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం అందిస్తామని హామీ ఇవ్వడం సంతోషించదగిన విషయమన్నారు.

ప్రత్యూష సపోర్టు చారిటీస్ సహకారంతో ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో 17మంది చిన్నారులకు యూకేకు చెందిన 11మంది వైద్యుల బృందం గుండె శస్త్రచికిత్సలు నిర్వహించిన విషయం విదితమే. ఈ సందర్భంగా వారితో మాట్లాడేందుకు సమంత శనివారం నగరానికి వచ్చారు. క్యాజువాలిటీలో ఉన్న చిన్నారులను చూసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. త్వరలో చెన్నైకు ట్రస్టు సేవలు విస్తరించనున్నట్లు తెలిపారు. ఆంధ్రా హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ పీవీ రమణమూర్తి మాట్లాడుతూ సమంత ప్రత్యూష సపోర్టు ట్రస్టు సహకారంతో ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement