
నిజామాబాద్ అర్బన్: గుండె సమస్యతో బాధపడుతున్న తొమ్మిది మందికి ఒకే రోజు ఆరోగ్యశ్రీ కింద వైద్యులు ఆపరేషన్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది గుండె సంబంధిత వ్యాధితో జిల్లా కేంద్రంలోని ప్రగతి హార్ట్‌సెంటర్‌కు వచ్చారు. వీరిని పరీక్షించిన డాక్టర్ గోపికృష్ణ.. బాధితులు ఆయాసం, ఛాతీ నొప్పి, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అరుదుగా ఉండే ఏవీఆర్‌టీ గుండె జబ్బుగా నిర్ధారించారు.
ఆదివారం వీరందరికీ శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స నిర్వహించడంతో రోగులకు ఆర్థిక భారం తగ్గిందని, లేదంటే ప్రైవేట్‌లో ఖర్చు ఎక్కువయ్యేదని పేర్కొన్నారు. శస్త్ర చికిత్సల్లో డాక్టర్ గోపికృష్ణతో పాటు డాక్టర్ విక్రం, నరేంద్ర, విజయ్, గుండెరావ్, రాజు, దిలీప్, కళావతి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment