టీవీ మీదపడి బాలుడికి తీవ్రగాయాలు | Tv droped on kid,injured | Sakshi
Sakshi News home page

టీవీ మీదపడి బాలుడికి తీవ్రగాయాలు

Published Sun, Sep 25 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

టీవీ మీదపడి బాలుడికి తీవ్రగాయాలు

టీవీ మీదపడి బాలుడికి తీవ్రగాయాలు

(చొల్లేడు)మునుగోడు:
టీవీప మీద పడి బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని చొల్లేడుతో ఆదివారం చోటు చేసుకుంది.  కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చొల్లేడు గ్రామానికి చెందిన కనకాల మహేష్, మమతల  దంపతులకు 15 నెలల క్రితం క్రాంతికుమార్‌ జన్మించాడు. అయితే ఆ బాలుడు ఇంట్లో ఆడుకుంటూ టీవీ స్టాండ్‌ వద్దకు వెళ్లి దానిని గట్టిగా కదిలించాడు. దీంతో ఆ స్టాండ్‌ మీద ఉన్న టీవీ ఆ బాలుడిపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తల్లితండ్రులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement