
స్కూల్ ఆవరణలో చెట్టుపడి చిన్నారి మృతి
రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్ విషాటు చేదం చోసుకుంది.
రంగారెడ్డి(ఇబ్రహీంపట్నం):మండలంలోని కొంగరకొలన్ గ్రామంలో చెట్టుకూలి గాయత్రి (5) అనే విద్యార్థిని మృతిచెందింది. గ్రామంలోని సరస్వతీ విద్యానికేతన్ స్కూల్ పక్కనే ఒక మర్రి చెట్టు ఉంది. నారాయణ అనే వ్యక్తి ఆ చెట్టును కూలీలతో చెట్టు నరికివేస్తుండగా ప్రమాదవశాత్తూ స్కూల్లో ఉన్న విద్యార్థినిపై పడింది. పాప మృతి చెందడంతో తల్లిదండ్రులు గణేశ్, చైతన్యలు కన్నీరుమున్నీరవుతున్నారు.
వారికి ఇద్దరు కుమార్తెలు. చనిపోయిన పెద్ద కుమార్తె గాయత్రి ఎల్‌కేజీ చదువుతోంది. ఈ ప్రమాదంలో మరో విద్యార్థినికి స్వల్ప గాయాలయ్యాయి.స్కూల్ ఆవరణలో ఉన్న చెట్టును కూల్చే క్రమంలో ముందస్తు చర్యలు తీసుకోపోవడం వల్లే చిన్నారి మృతి చెందిందని విమర్శలు వినిపిస్తున్నాయి.