లబ్బీపేట (విజయవాడ తూర్పు): కులాంతర వివాహం చేసుకున్నాడు. రెండు విద్యాసంస్థల్లో ఫిజికల్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఎంతో ఉదాత్తంగా ఉండాల్సిన ఆ వ్యక్తి తన ఐదేళ్ల కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టి కటకటాల పాలయ్యాడు. ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. విజయవాడ నగరంలోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఇనిస్టిట్యూట్‌తో పాటు మరో ఇంజినీరింగ్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పని చేస్తున్న నిందితుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కాగా, నున్న మ్యాంగో మార్కెట్ సమీపంలో అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా, ఈ ఏడాది జూన్ 26న అతడు తన ఐదేళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో ఇంటి నుంచి పరారయ్యాడు. ఆ విషయాన్ని తల్లి బయటకు చెప్పుకోలేకపోయింది. కాగా, ఈ నెల 4న ఇంటికి వచ్చి తండ్రి ఆ పాపను అపహరించే ప్రయత్నం చేయగా.. ఆమె నాయనమ్మ అడ్డుకుని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసింది. ఈ ఘటనపై దిశ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ బాలికకు పాత ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పాత ప్రభుత్వాస్పత్రికి చేరుకుని ఘటనపై నిరసన తెలియజేశారు.
కన్న కూతురిపై అఘాయిత్యం.. ఆపై కిడ్నాప్‌నకు యత్నం
Published Thu, Sep 9 2021 3:56 AM | Last Updated on Thu, Sep 9 2021 12:00 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment