small girl
-
కీచక తండ్రి: కన్న కూతురిపై అఘాయిత్యం.. ఆపై..
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కులాంతర వివాహం చేసుకున్నాడు. రెండు విద్యాసంస్థల్లో ఫిజికల్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఎంతో ఉదాత్తంగా ఉండాల్సిన ఆ వ్యక్తి తన ఐదేళ్ల కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టి కటకటాల పాలయ్యాడు. ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. విజయవాడ నగరంలోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఇనిస్టిట్యూట్‌తో పాటు మరో ఇంజినీరింగ్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పని చేస్తున్న నిందితుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కాగా, నున్న మ్యాంగో మార్కెట్ సమీపంలో అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. కాగా, ఈ ఏడాది జూన్ 26న అతడు తన ఐదేళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో ఇంటి నుంచి పరారయ్యాడు. ఆ విషయాన్ని తల్లి బయటకు చెప్పుకోలేకపోయింది. కాగా, ఈ నెల 4న ఇంటికి వచ్చి తండ్రి ఆ పాపను అపహరించే ప్రయత్నం చేయగా.. ఆమె నాయనమ్మ అడ్డుకుని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసింది. ఈ ఘటనపై దిశ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ బాలికకు పాత ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పాత ప్రభుత్వాస్పత్రికి చేరుకుని ఘటనపై నిరసన తెలియజేశారు. -
చిన్నారిని చిదిమేసిన కారు
సాక్షి, మంచిర్యాల: అతివేగంగా వచ్చిన కారు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ముందువెళ్తున్న ఆటోను ఢీకొని ఓ చిన్నారిని చిదిమివేయగా.. ఆమె తల్లిదండ్రులను ఆసుపత్రి పాలుచేసింది. కనీసం తల్లిదండ్రుల చివరిచూపునకు నోచుకోని ఆ చిన్నారికి గ్రామస్తులే అన్నీతామై అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ విషాదకర సంఘటన లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై మధుసూదన్‌రావు కథనం ప్రకారం.. పాతకొమ్ముగూడెం గ్రామానికి చెందిన బియ్యాల మనోహర్ తన తల్లి శాంతవ్వ, భార్య సునీత, కుమారుడు భుమన్వర్మ, కూతురు అమ్ములు (28 రోజులు)తో కలిసి సోమవారం దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణస్వామి ఆలయానికి వెళ్లారు. మొక్కులు చెల్లించుకుని రాత్రివరకు అక్కడే ఉన్నారు. సోమవారం రాత్రి 11 గంటలకు ఇంటికి ఆటోలో బయల్దేరారు. వెంకట్రావుపేట గ్రామ స్టేజీవద్దకు రాగానే.. జన్నారం వైపు వెళ్తున్న కారు ఆటోను వెనుకనుంచి బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఆటో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులంతా కిందపడిపోవడంతో అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. మనోహర్‌కు చేయి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. అమ్ములు ఆటోలోనే చనిపోయింది. గాయపడిన ఆటో డ్రైవర్ సత్యనారాయణతోపాటు మిగిలిన వారిని స్థానికులు 108 సహాయంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అమ్ములు శవాన్ని మార్చురీలో భద్రపర్చారు. గ్రామస్తుల సాయంతో అంత్యక్రియలు.. కుటుంబ సభ్యులందరూ కరీంనగర్లో చికిత్స పొందుతుండగా.. వారిని చూసేందుకు బంధువులు ఆసుపత్రికి వెళ్లారు. అప్పటికే సమయం దాటిపోతుండడంతో మనోహర్ బాబాయి (అమ్ములుకు తాత) బియ్యాల లచ్చన్న గ్రామస్తుల సహకారంతో అమ్ములు మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు. తల్లి దండ్రులు చిన్నారి చివరి చూపునకు సైతం నోచుకోలేదు. శోకసంద్రంలో తల్లిదండ్రులు అమ్ములు చనిపోయిందన్న విషయం తెలుసుకుని మనోహర్, సునీత దంపతులు ఆసుపత్రిలో రోదించిన తీరు పలువురిని కలచివేసింది. కనీసం తమ బిడ్డను చివరిచూపు చూడలేకపోయామే.. అని కంటతడి పెట్టారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చిన్నారిని చిదిమేసింది!
► బాలికను కబళించిన స్కూల్ బస్సు ► గొట్టలో విషాదఛాయలు హిరమండలం : తల్లి ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన చిన్నారిని స్కూల్ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. పేదింట అంతులేని విషాదాన్ని మిగిల్చింది. అప్పటివరకు చిట్టిపొట్టి అడుగులతో.. చిన్నిచిన్ని మాటలతో ఆనందంగా గడిపిన చిన్నారికి... అన్నయ్య వెళ్లే స్కూల్ బస్సే యమపాశమైంది. రెప్పపాటు కాలంలోనే బస్సు చక్రాల కింద పడి నుజ్జునుజ్జయింది. కన్నతల్లి కళ్ల ముందే ఈ ఘోరం జరిగిపోయింది. ఈ ఘటన మండలంలోని గొట్ట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. నిండా మూడేళ్లూ నిండని కుమార్తె.. అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోవడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ధనుపురం గ్రామానికి చెందిన చీకటి వసంతరావు, రోహిణిలకు ఇద్దరు పిల్లలు. ఆరేళ్ల వయస్సు గల పెద్ద కుమారుడు వేణుగోపాలరావు మండలంలోని కల్లటలో ఉన్న కార్మిల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నాడు. ధనుపురంలో ఉంటున్న రోహిణి.. శుభకార్యం నిమిత్తం గొట్ట గ్రామంలోని తన తమ్ముడి ఇంటికి ఐదు రోజుల క్రితం వచ్చింది. శనివారం ఉదయం కుమారుడు వేణుగోపాలరావును ఇక్కడి నుంచే స్కూల్‌కు పంపించేందుకు సిద్ధం చేసి, బస్సు కోసం వేచి చూస్తోంది. కుమారుడిని స్కూల్‌కు తీసుకువెళ్లే బస్సే.. తన చిన్నారి కూతురు జీవితాన్ని బలిగొంటుందని ఆ క్షణంలో ఆమె ఊహించలేదు. కుమారుడిని బస్సు ఎక్కించేందుకు బయటకు వచ్చిన ఆమె.. తన వెంటే కుమార్తె శార్వాణి వచ్చిందన్న విషయం గమనించలేదు. తల్లి వెనుకగా వచ్చిన శార్వాణి.. బస్సు టైర్ల చెంతనే నిల్చొంది. బస్సు ఎక్కిన కుమారుడు.. తల్లికి ‘బై..బై’ అంటూ చెప్పడం, వెంటనే బస్సు కదలడం.. ఆ చక్రాల కింద కుమార్తె శార్వాణి నలిగిపోవడం ఒక్కసారిగా జరిగిపోయాయి. కుమార్తె కేకలు విన్న ఆ తల్లి.. ఒక్కసారిగా నిశ్చేష్టురాలైపోయింది. అప్పటికే ఆ చిట్టితల్లి చక్రాల కింద బలైపోయింది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటనతో గొట్ట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు తీయడం వల్లే ముందు టైరుకింద పడి పాప చనిపోయిందని స్థానికులు చెబుతున్నారు. తల్లి రోహిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై కె.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. రహదారి ప్రమాదాల ప్రత్యేక టీమ్ రాజాం ఎస్సై జె.శంకరరావు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.