సాక్షి, శృంగవరపుకోట(భువనేశ్వర్): యెగాతో అందరికీ ఆరోగ్యం సాధ్యం. ఈ విషయం తెలిసినా అధికశాతం మంది కాదనుకుని వదిలేస్తున్నారు. ఏడేళ్ల చిన్నారి వత్రం మేనమామను అనుకరించి ఆసనాల్లో దిట్ట అనిపించుకుంటోంది. శృంగవరపుకోటకు చెందిన ఏడేళ్ల కర్రి హర్షిత యోగాలో విశేష ప్రతిభ చపుతోంది. హర్షిత మేనమామ భానుప్రకాష్‌రెడ్డి నిత్యం యోగా సాధన చేస్త నైపుణ్యం సాధించారు.
మేనమామ యోగా సాధన చేస్తున్న సమయంలో అతడిని హర్షిత అనుకరించేది. ఆసనాలు వేయడం నేర్చుకుంది. మేనకోడలి ఆసక్తి గమనింన భానుప్రకాష్ ఏడాదిన్నర వయసు నుం హర్షితకు ఆసనాలు వేయడం నేర్పించారు. ఐదేళ్ల వయసు వచ్చేసరికి ఆసనాల్లో దిట్ట అయ్యింది. ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్న హర్షిత 200పైగా ఆసనాలు వేస్తోంది. సువరు 100 వరకూ ఆసనాలు పేర్లు చెప్పగానే వేస్తుంది. మరో 100 వరకూ సంక్లిష్ట ఆసనాల పేర్లు తెలియకపోయినా అనుకరిస్త క్షణాల్లో అలాగే ఆసనం వేస్తుంది. పిన్న వయసులో ప్రతిభ చపుతున్న చిన్నారి హర్షితను పలువురు అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment