చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాల మీదకు వచ్చినా అదృష్టవశాత్తు ఆ బుడ్డోడు ప్రాణాలతో బయటపడ్డాడు. తన తండ్రి కారు డోర్ సరిగా లాక్ చేయకపోవడంతో వేగంగా వెళ్తున్న కారులోంచి కిందపడిపోయాడు. ఒక భారీ వాహనం వెంటనే బాలుడి సమీపానికి వచ్చినా.. ప్రమాదపు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పంకజ్ జైన్ అనే ఐపీఎస్ అధికారి తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
ఓ వ్యక్తి తన కొడుకుతో కలిసి కారులో వెళ్తుండగా వెనకాల కూర్చున్న చిన్నారి కారు నుంచి కింద పడిపోయాడు. డోర్ సరిగా లాక్ చేయకపోవడంతో ఒక మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. బాలుడు కింద పడిన సమయంలో కారు వెనుకే మరో వాహనం వేగంగా వచ్చింది. అయితే సదురు డ్రైవర్ అప్రమత్తతో వ్యవహరించి వాహనాన్ని బాబుకు సమీపంగా తీసుకొచ్చి ఆపేశాడు. దీంతోఆ చిన్నారి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. కాగాఘ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్‌పై తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మరోవైపు ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ వీడియో చూసి అయినా మారాలంటూ ఐపీఎస్ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment