ట్రైసైకిల్‌తో ట్రాఫిక్‌లోకి బుడ్డోడు! | Three Year Old Boy Enters In Busy Road With His Tricycle | Sakshi
Sakshi News home page

ట్రైసైకిల్‌తో ట్రాఫిక్‌లోకి బుడ్డోడు!

Published Thu, Mar 22 2018 6:26 PM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM

మూడేళ్ల బాలుడు తన మూడు చక్రాల సైకిల్‌తో ఆడుకుంటూ రోడ్డెక్కేశాడు. వీడియో గేమ్‌లా ఫీల్‌ అయ్యాడో ఏమో తెలియదుగానీ రోడ్డుపై వస్తున్న వాహనాలకు వ్యతిరేకంగా వెళ్లడం మొదలు పెట్టాడు. అసలే అది ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే సమయం. రోడ్డు మీద ఎదురుగా వాహనాలు వస్తూనే ఉన్నాయి. అన్నీ వాహనాలు చిన్నారి పక్కనుంచే వెళ్తున్నా, బాబుని పక్కకు తీసుకెళ్దామని ఎవరు ప్రయత్నించలేదు. తూర్పు చైనాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తొలిసారి ఈ వీడియో చూసేవారికేవరికైనా ఒక్క క్షణం ఆ బాబుకి ఏమవుతుందో అనే ఆందోళన కలగక మానదు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement